Gopichand : టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత గోపీచంద్ దర్శకుడు తేజతో, అలాగే మారుతితో సినిమాలు చేస్తున్నాడు.
మారుతి చెప్పిన కథ నచ్చడంతో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశికన్నా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి జిల్ అనే సినిమాలో నటించారు. ఇక మారుతి దర్శకత్వం వహించిన చివరి సినిమా ప్రతిరోజు పండగే లో రాశి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభించకుండానే అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్టు దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. బన్నీ వాసు యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ విక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
ఉత్తరాఖండ్ ఘటనలో నిరంతర సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు సంఘీభావం తెలుపుతున్న సినీ ప్రముఖులు