
Pakka Commercial: టాలీవుడ్ టాల్ హీరో గోపిచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. గత కొంత కాలంగా సరైన హిట్స్ లేని గోపీచంద్ ఈ సినిమా పైన బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ఇది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా ఈ పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు చిత్రయూనిట్.
ఆ మధ్య రిలీజ్ డేట్ కోసం కుర్చీ మీద కర్చీఫ్ వేసినట్లు పోస్టర్ వదిలి సెటైర్ వేశారు మారుతి. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఇండస్ట్రీలో బడా సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేస్తున్నాయి. అయితే పక్కా కమర్షియల్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2022 మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ లో ‘కరోనా కరుణిస్తేనే.. వస్తాం’ అని పేర్కొన్నారు చిత్రయూనిట్. అంటే కరోనా వ్యాప్తి తగ్గక పోతే రావడం కష్టమే అని చెప్పకనే చెప్పాడు మారుతి. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :