Gopichand: వరుస ఫ్లాప్‌లకు చెక్‌ పెట్టేందుకు లక్కీ డైరెక్టర్‌తో చేతులు కలిపిన గోపీచంద్‌.. ఇందులో మరో బడా హీరో కూడా.

|

Jul 15, 2021 | 1:21 PM

Gopichand: 'జయం', 'నిజం' సినిమాల్లో విలన్‌ పాత్రలో నటించి టాలీవుడ్‌కు ఒక కొత్త విలన్‌గా పరిచయమయ్యారు నటుడు గోపీచంద్‌. కానీ అనంతరం తనలో విలన్‌ కాదు...

Gopichand: వరుస ఫ్లాప్‌లకు చెక్‌ పెట్టేందుకు లక్కీ డైరెక్టర్‌తో చేతులు కలిపిన గోపీచంద్‌.. ఇందులో మరో బడా హీరో కూడా.
Gopichand
Follow us on

Gopichand: ‘జయం’, ‘నిజం’ సినిమాల్లో విలన్‌ పాత్రలో నటించి టాలీవుడ్‌కు ఒక కొత్త విలన్‌గా పరిచయమయ్యారు నటుడు గోపీచంద్‌. కానీ అనంతరం తనలో విలన్‌ కాదు అసలు సిసలైన హీరోగా ఉన్నాడని చాటి చెప్పారు. ‘ఆంధ్రుడు’, ‘శౌర్యం’, ‘గోలీమార్‌’ ఇలా వరుస హిట్‌ సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు గోపీ చంద్‌. అయితే 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత గోపీచంద్‌ మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారనే చెప్పాలి. వరుస పరాజయలతో సతమతవుతోన్న ఇలాంటి సందర్భంలో మళ్లీ ఫామ్‌లోకి రావాలనే ఉద్దేశంతో వరుసగా ఆసక్తికర సినిమాలకు ఓకే చెబుతూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘సీటీమార్‌’, మారుతి డైరెక్షన్‌లో ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కూడా విడుదల కాకముందే మరో సినిమాకు ఓకే చెప్పారు.

గోపీచంద్‌కు లౌక్యం, లక్ష్యం వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్‌తో మరోసారి చేతులు కలిపారు గోపీచంద్‌. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ కూడా నటించనున్నారనేది సదరు వార్త సారాంశం. ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజశేఖర్‌.. గోపీచంద్‌కు అన్నగా నటించనున్నట్లు వినికిడి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. టిజి విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది.

Also Read: Taapsee Pannu: జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టిన తాప్సీ.. తిరిగి ఇచ్చేయాలన్న ఉద్దేశంతోనే అంటూ..

Megastar Chiranjeevi: అప్పట్లోనే దూరదర్శన్‌లో ప్రసారమైన ఓ సీరియల్‌లో నటించిన చిరు.. ఏ సీరియల్ అంటే..

RRR Movie: అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు జక్కన్న ఎంతలా కష్టపడ్డారో చూశారా? ఆకట్టుకుంటోన్న ఆర్.ఆర్‌.ఆర్‌ మేకింగ్‌ వీడియో.