Pradeep Machiraju: ప్రదీప్‌ది ఎంత గొప్ప మనసో తెలుసా..? అనాధ పిల్లలకోసం ఏం చేస్తాడంటే

|

May 30, 2024 | 4:04 PM

ఎన్నో షోలకు ప్రదీప్ యాంకర్ గా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. గతకొంతకాలంగా ప్రదీప్ టీవీల్లో కనిపించడం లేదు. ఆయన కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడని అంటున్నారు. తన మాటలతో ఎలాంటి షో అయినా సక్సెస్ ఫుల్ చేయగలడు ప్రదీప్. చలాకీగా మాట్లాడుతూ.. పంచ్ లు వేస్తూ నవ్వులు పూయిస్తాడు ప్రదీప్. షో ఏదైనా ప్రదీప్ ఉన్నదంటే ప్రేక్షకులకు తెలియని ఆసక్తి నెలకొంటుంది. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Pradeep Machiraju: ప్రదీప్‌ది ఎంత గొప్ప మనసో తెలుసా..? అనాధ పిల్లలకోసం ఏం చేస్తాడంటే
Pradeep Machiraju
Follow us on

బుల్లి తెరపై స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. కానీ మేల్ యాంకర్స్ లో మాత్రం ప్రదీప్ మాచి రాజుకు మంచి పేరు ఉంది. ఎన్నో షోలకు ప్రదీప్ యాంకర్ గా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. గతకొంతకాలంగా ప్రదీప్ టీవీల్లో కనిపించడం లేదు. ఆయన కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడని అంటున్నారు. తన మాటలతో ఎలాంటి షో అయినా సక్సెస్ ఫుల్ చేయగలడు ప్రదీప్. చలాకీగా మాట్లాడుతూ.. పంచ్ లు వేస్తూ నవ్వులు పూయిస్తాడు ప్రదీప్. షో ఏదైనా ప్రదీప్ ఉన్నదంటే ప్రేక్షకులకు తెలియని ఆసక్తి నెలకొంటుంది. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ప్రదీప్ అంత ఈజీగా స్టార్ యాంకర్ అవ్వలేదు. కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి ప్రదీప్ చాలా కష్టపడ్డాడు. మొదట్లో చిన్న చిన్న షోలు చేశాడు. అలాగే ఓ డాన్స్ షోలోనూ పాల్గొన్నాడు. కానీ అప్పుడు అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

కానీ ఇప్పుడు ప్రదీప్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇక ప్రదీప్ యాంకర్ కొంచం టచ్ లో ఉంటే చెప్తా అనే ప్రోగ్రాం ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే గడసరి అత్తా సొగసరి కోడలు షో తో లేడీ ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు. అలాగే డీ డాన్స్ షోకు కూడా హోస్ట్ గా వ్యవహరించాడు. వీటితో పాటు హీరోగానూ సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రదీప్ జులాయి, అత్తారింటికి దారేది సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించాడు.

అలాగే హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా గెటప్ శ్రీను ప్రదీప్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్నీ తెలిపాడు. రాజు యాదవ్ సినిమాతో హీరోగా మారిన గెటప్ శ్రీను ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను, ప్రదీప్ మంచి ఫ్రెండ్స్ అని తెలిపాడు. నేను , సుధీర్, ప్రదీప్ ఓ లోకల్ టీవీలో చేశాం. చాలా కష్టపడ్డాడు. చాలా మంచివాడు. ప్రదీప్ వేసుకునే కాస్ట్యూమ్స్ ను అమ్మి అనాధ పిల్లలకు ఆ డబ్బులు ఇస్తాడు. వాటిలో ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ విషయం ఎవరికీ తెలియదు అని చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.