Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‏లో సినీప్రముఖుల సందడి..

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రెండో రోజు మంగళవారం కీలక ఘట్టాలకు వేదిక అయ్యింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను అధికారికంగా విడుదల చేశారు. ఈ పత్రంలో వచ్చే రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్ర అభివృధ్ది దిశ, లక్ష్యాలు, వృద్ధి వ్యూహాలు వివరంగా ఉండనున్నాయి.

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‏లో సినీప్రముఖుల సందడి..
Telangana Rising Global Sum

Updated on: Dec 09, 2025 | 10:30 PM

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రెండో రోజు మంగళవారం కీలక ఘట్టాలకు వేదిక అయ్యింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను అధికారికంగా విడుదల చేశారు. ఈ పత్రంలో వచ్చే రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్ర అభివృధ్ది దిశ, లక్ష్యాలు, వృద్ధి వ్యూహాలు వివరంగా ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశీయ అంతర్జాతీయ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతోపాటు .. సినీప్రముఖులు సైతం పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, హీరోయిన్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ సైతం హాజరయ్యారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ వేదికపై రితేష్, జెనీలియా సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ రాకేష్ ఓం మాట్లాడుతూ.. ఇది కేవలం స్టూడియోస్‌కి, టెక్నాలజీకి సపోర్ట్ చేయటం కాదు. రైటర్స్ కోసం ఓ స్కూల్‌ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఇప్పుడే అల్లు అరవింద్గారితో మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నా చేతుల్లో ఉన్న సినిమాలు పూర్తయిన తరువాత పూర్తిగా యంగ్‌ స్టర్స్‌తో కలిసి సినిమా గురించి పని చేయాలనుకుంటున్నాను. అలాగే రచయితలే సినిమాకు ఫస్ట్ స్టార్స్‌… రైటింగ్ బాగుంటే సినిమా బాగుటుంది. ఇక్కడి రావటం చాలా ఆనందంగా ఉంది… తెలుగు సినిమా లెజెండ్స్‌తో స్టేజ్‌ షేర్‌ చేసుకోవటం గర్వంగా ఉంది. వీళ్లు సాధించిన విజయాలు చూసి చాలా నేర్చుకున్నాం. మనం ఇప్పుడు కోరియన్ స్టోరీస్‌ గురించి మాట్లాడుతున్నాం. కొరియా ఈ రేంజ్‌కు రావడానికి చాలా ఏళ్లు పట్టిందిఅని అన్నారు.

అలాగే జెనీలీయా మాట్లాడుతూ.. నాకు తెలుగులో రెండు నంది అవార్డ్స్ వచ్చాయి… అది నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ నాకు చాలా సెక్యూర్డ్‌గా అనిపిస్తుంది… ఈ సిటీ అందరినీ ఎంకరేజ్ చేస్తుంది.. సత్యం నా ఫస్ట్ తెలుగు సినిమా నిర్మాత సుప్రియ. అప్పట్లో ఆమె ఒక్కరే సెట్‌లో ఉన్న విమెన్‌, ఈ ఇండస్ట్రీలో మెన్‌ చాలా సపోర్టివ్‌గా ఉన్నారుఅని అన్నారు.

రితేష్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. నా ప్రయాణం ఇక్కడే మొదలైంది. నా తొలి సినిమా తుజే మేరి కసమ్‌ రామోజీ రావ్‌ గారు నిర్మించారు. వర్క్ ఎతిక్స్‌, సినిమాలు ఎలా చేస్తారు అన్ని ఇక్కడే నేర్చుకున్నా. మేం ఎక్కువగా మరాఠి సినిమాలు మాత్రమే చేస్తాను. ఇండియన్‌ సినిమాకు ఆధ్యుడు మరాఠి వ్యక్తి దాదాసాహెబ్ పాల్కే. మహారాష్ట్రాలో ఆడియన్స్ ఫస్ట్ చాయిస్‌ హిందీ సినిమా… మరాఠి సినిమా అనేది సెకండ్ ఆప్షన్‌..అందుకే మరాఠి సినిమా చేయటంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ప్రతీ ఇండస్ట్రీ మరో ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాలి. ఈ ఇండస్ట్రీలో స్కిల్‌ చాలా ఇంపార్టెంట్ పని చేయటంలోనే చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ అవన్నీ ప్రొఫెషనల్‌గా ముందే నేర్చుకొని వస్తే. సినిమా మేకింగ్‌ మరింత క్వాలిటీగా ఉంటుందిఅని అన్నారు.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..