
ఇప్పుడు ఎక్కడ చూసిన సలార్ మేనియా కనిపిస్తుంది. ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూశారు అభిమానులు. డార్లింగ్ నటించిన గత మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఎట్టకేలకు సలార్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఇప్పటివరకు ఉన్న రికార్డ్ అన్ని సలార్ సినిమా బద్దలు కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తుంది.
సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ దగ్గర సందడి మాములుగా లేదు. ఇక ఈ సినిమా చూసేందుకు సెలబ్రేటీలు కూడా క్యూకడుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ సలార్ బెనిఫిట్ షో చూస్తాను అని గతంలోనే చెప్పాడు. అలాగే థియేటర్స్ లో హీరో శ్రీవిష్ణు ఫ్యాన్స్ తో కలిసి సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా థియేటర్ లో సినిమా చూశారు.
అలాగే కొంతమంది సెలబ్రెటీలు సలార్ సినిమా పై తమ రివ్యూలు ఇస్తున్నారు. బిగ్ బాస్ ఫేం గీతూ రాయల్ సలార్ సినిమా పై క్రేజీ కామెంట్స్ చేసింది.గీతూ మాట్లాడుతూ.. నేను.. సలార్ బెనిఫిట్ షో చూశా.. చాలామంది ఎట్టుంది ఎట్టుంది అని అడుగుతున్నారు. ఈ సినిమా చూడకముందు ఫ్లాప్ అనుకున్నా.. సలార్ కూడా ఫ్లాపేలే అని అనిపించింది. కానీ సినిమా అయితే అద్దిరిపోయింది. ఆ స్టోరీ కానీ.. ఆ ట్విస్ట్‌లు కానీ.. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్‌లు కానీ భయంకరంగా ఉంది. కానీ ఫస్ట్ టైం చూస్తే అర్ధం కాదు అని చెప్పింది. సెకండ్ టైం చూస్తే ఇంకా అర్ధమవుతుంది. నేను అంత బ్రెయిని కాదేమో అందుకే నాకు అర్ధం కాలేదు. కానీ కథ మాత్రం అదిరిపోయింది. ప్రభాస్ కటౌట్ ఓమైగాడ్ అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్.
అలాగే.. ‘గృహలక్ష్మి’ సీరియల్ నటి పూజిత రెడ్డి కూడా సలార్ సినిమా పై రివ్యూ ఇచ్చింది. ఈ అమ్మడు సలార్ సినిమాలో నటించింది. అలాగే సలార్ సినిమా చూసి ‘నాకు ఈ ఏడాదిలో ది బెస్ట్ మూమెంట్ అంటే ‘సలార్’ సినిమా. చాలా రోజుల తరువాత జనాలు టికెట్ల కోసం క్యూలో నిలబడటం.. సర్వర్‌లు క్లాష్ కావడం.. అవన్నీ చూస్తుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సినిమాలో సురభి అనే క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేశాయి. అబ్బబ్బా ప్రభాస్.. ఏ కటౌట్‌రా బాబూ.. ఏమున్నాడ్రా బాబూ అని అనిపించింది. రికార్డులన్నీ బద్దలు కాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.