Gaali Sampath : `గాలి సంపత్`గా రానున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'గాలి సంపత్`. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండడంతో సినిమాకి స్పెషల్ క్రేజ్ వచ్చింది.

Gaali Sampath : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘గాలి సంపత్`. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండడంతో సినిమాకి స్పెషల్ క్రేజ్ వచ్చింది. వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి పర్యవేక్షణలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా `గాలి సంపత్` రూపొందుతోంది. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ `గాలి సంపత్`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ మహా శివరాత్రి కానుకగా మార్చి11న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ `ఫిఫిఫీ…ఫిఫీ..ఫి…. క్రేజిడాడీ సాంగ్‌ని నేచురల్ స్టార్ నాని విడుదలచేశారు. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – “ఇద్దరు అద్భుతమైన నటులు రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీవిష్ణు కలిసి నటించిన గాలి సంపత్ చిత్రంలోని సాంగ్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకి స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు అచ్చురాజమణి మంచి స్వరాలు సమకూర్చారు. డా. రాజేంద్రప్రసాద్, రాహుల్ నంబియార్, శ్రీ కృష్ణ విష్ణుబొట్ల కలిసి పాడారు. ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.




