
Friday Releasing Movies List: కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరమయ్యారు. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడడంతో సినిమాలు చూడలేని పరిస్థితి. దీంతో సగటు సినీ ప్రేక్షకుడు డీలా పడ్డాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కరోనా వ్యాప్తి తగ్గడం.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కేంద్రం కూడా నిబంధనలను సడలిస్తోంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి ఆక్యూపెన్సీతో థియేటర్లు నడపడానికి అనుమతులు లభించాయి.
ఇక థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రేక్షకులు కూడా సినిమాల కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ తర్వాత విడుదలై క్రాక్, ఉప్పెన వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం థియేటర్లలో నాలుగు సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో సుశాంత్ హీరోగా తెరకెక్కిన కపటధారి ఒకటి. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన విశాల్ చిత్రం ‘చక్రం’ కూడా ఈ శుక్రవారం విడుదల కానుంది. వీటితో పాటు ఈ వారాంతం వస్తోన్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘నాంది’. నరేష్ సీరియస్ రోల్‌లో నటిస్తూ.. ఆసక్తికరమై కథనంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక వీటితో పాటు మరో కన్నడ డబ్బింగ్ చిత్రం ‘పొగరు’ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడవానికి వస్తోంది. దృవ సర్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.