RK Roja: తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రోజా పూజలు.. కావడితో మొక్కు చెల్లించుకున్న మాజీ మంత్రి

ఆడికృతిక పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం (ఆగస్టు 16) నగరి లోని తన నివాసం నుంచి పుష్ప కావడితో బయలుదేరి తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి వారిని మొక్కు చెల్లించుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

RK Roja: తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రోజా పూజలు.. కావడితో మొక్కు చెల్లించుకున్న మాజీ మంత్రి
RK Roja

Updated on: Aug 16, 2025 | 8:11 PM

ఆడికృతికను పురస్కరించుకుని వైఎస్ఆర్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా తిరుత్తణి ఆలయాన్ని దర్శించుకున్నారు.
శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావడి మొక్కులను చెల్లించుకున్నారు. అంతకుముందు నగరిలోని తన నివాసం నుంచి పుష్ప కావడితో తిరుత్తణికి బయలుదేరి వచ్చారు. ప్రతి సంవత్సరం ఆడికృతిక నాడు క్రమం తప్పకుండా కావడి మోస్తూ తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి రోజా మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఆమె సుబ్రమణ్యస్వామికి కావడి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని కానుకలను హుండీలో సమర్పించారు. ఆమె వెంట నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ప్రస్తుతం రోజా కావడి మొక్కులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆడికృతిక ను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు తమిళులు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు అంతటా సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.

కాగా నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా జగన్ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలకు గుడ్ బై చెప్పేశారామె. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు రోజా. దీంతో మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారామె. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతోన్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు రెగ్యులర్ గా వస్తోంది రోజా. అదే సమయంలో ఎప్పటిలాగే పొలిటికల్ పరంగానూ తన ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

RK Roja 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.