Sehwag-Pawan Kalyan: సెహ్వాగ్‌ నోట పవన్‌ కళ్యాణ్‌ మాట.. కొత్త ట్యాలెంట్‌ చూపిస్తోన్న ఒకప్పటి స్టార్‌ క్రికెటర్‌.

Sehwag-Pawan Kalyan: ఎక్కువ మంది ఆసక్తి చూపే వాటిలో క్రీడలు, సినిమాలు మొదటి స్థానంలో ఉంటాయి. మరి ఈ రెండు రంగాలకు చెందిన వారు కలిస్తే..

Sehwag-Pawan Kalyan: సెహ్వాగ్‌ నోట పవన్‌ కళ్యాణ్‌ మాట.. కొత్త ట్యాలెంట్‌ చూపిస్తోన్న ఒకప్పటి స్టార్‌ క్రికెటర్‌.

Updated on: Sep 07, 2021 | 4:15 PM

Sehwag-Pawan Kalyan: ప్రస్తుతం ప్రాంతాల మధ్య దూరం చెరిగిపోతోంది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కిన సినిమాలు హిందీలో విడుదలవుతున్నాయి. అక్కడ తెరకెక్కిన సినిమాలు ఇక్కడ విడుదలవుతున్నాయి. ఇక సమాజంలో ఎక్కువ మంది ఆసక్తి చూపే వాటిలో క్రీడలు, సినిమాలు మొదటి స్థానంలో ఉంటాయి. మరి ఈ రెండు రంగాలకు చెందిన వారు కలిస్తే.. అభిమానులకు అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. మరీ ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలను సినిమాలుగా తెరకెక్కిస్తుండడం, కొందరు ప్లేయర్స్‌ నేరుగా సినిమాల్లో నటిస్తుండడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్‌ క్రికెటర్‌ మాజీ టీమిండియా ఆటగాడు సెహ్వాగ్‌ చెప్పిన సినిమా డైలాగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

పవన్‌ కెరీర్‌లో గబ్బర్‌ సింగ్ సినిమాకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస అపజయాల తర్వాత విజయాన్ని అందించిన ఈ చిత్రం పవన్‌కు స్పెషల్‌ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో పవన్‌ చెప్పిన ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే చెప్పే డైలాగ్ ఆయన ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేసింది. అయితే తాజాగా సెహ్వాగ్‌ ఇదే డైలాగ్‌ను చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. మొబైల్‌లో పవన్‌ డైలాగ్‌ చెబుతున్న వీడియోను చూస్తూ.. పక్కన అమ్మాయి సాయం చేస్తుండగా సెహ్వాగ్‌ డైలాగ్‌ను పలికిన తీరు అభిమానులను ఫిదా చేస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పడిదో తెలియనప్పటికీ ప్రస్తుతం నెట్టింట మాత్రం వైరల్‌గా మారింది. మరి సెహ్వాగ్‌, పవన్‌ డైలాగ్‌ను ఎలా చెప్పాడో మీరూ వినేయండి..

Also Read: Vinayaka Chavathi: వినాయక చవితి వేళ విషాదం.. ప్రాణం తీసిన తామర పూలు.. భార్య చూస్తుండగానే భర్త మృతి!

Vinayaka Chavithi: కాల్ కొట్టు.. గణేశుడి ప్రతిమ పట్టు.. హైదరాబాద్‌లో 70 వేల విగ్రహాల రూపకల్పన..

Rashi Khanna: అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటానంటోన్న అందాల రాశీ.. మనసులో మాట బయట పెట్టిన ముద్దుగుమ్మ..