సంక్రాంతి పండక్కి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘గుంటూరు కారం’. జనవరి 12న అడియన్స్ ముందుకు వచ్చి అత్యధిక వసూళ్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్ కమర్షియల్ టచ్ ఇచ్చాడు గురూజీ. అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడి జీవితమే గుంటూరు కారం. ఇందులో మీనాక్షి, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేశ్, జయరామ్ కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనూ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ మూవీ. చాలా కాలం తర్వాత మహేష్ మాస్ లుక్ చూసి మురిసిపోయారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఎప్పటిలాగే తమన్ అందించిన మాస్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ మూవీలోని ప్రతి సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఏ రేంజ్ సెన్సేషన్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్పులకు బాక్సాఫీస్ బద్దలైపోయింది. గురూజీ, మహేష్ ఇద్దరి నుంచి అలాంటి పాటను అడియన్స్ అసలు ఊహించలేదు. దీంతో ఈ పాటకు నెట్టింట సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు చిన్నా, పెద్ద డాన్స్ చేస్తూ సూపర్ అనిపిస్తున్నారు. అయితే ఈ మాస్ ఎనర్జిటిక్ పాటను కొందరు ఫారినర్స్ మాత్రం మరోలా ఉపయోగిస్తున్నారు.
జిమ్ వర్కవుట్స్ చేస్తూ ఈ పాటను వింటున్నారు. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ..అటు కుర్చిమడత పెట్టి సాంగ్ ప్లే చేస్తున్నారు. పాటకు తగినట్లుగా ఫుల్ ఎనర్జీతో వర్కవుట్స్ చూస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక ఇదే వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు మహేష్. ఈ వీడియోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.
warmup కుమ్మేశారు 🤩
pic.twitter.com/4YxFxio8Vv— Kishan Jsp (@kishan_Janasena) February 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.