Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సినిమా హిట్ అవ్వాలని పిఠాపురంలో పెద్దెత్తున పూజలు, హోమాలు

భారీ ఖర్చుతో నిర్మాణమైన కల్కి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదగయలో కల్కి సినిమా విజయం కోసం ప్రత్యేక పూజలు ,హోమాలు చేపట్టారు.. ప్రముఖ దత్త ఉపాసకుడు లక్ష్మీనారాయణ దత్త, పాదగయ పుణ్యక్షేత్రంలో దత్త హోమం నిర్వహించారు.. పిఠాపురంలో దత్త పూజలు నిర్వహించి విడుదల అయిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సినిమా హిట్ అవ్వాలని పిఠాపురంలో పెద్దెత్తున పూజలు, హోమాలు
Kalki 2898 Ad Cinema

Edited By:

Updated on: Jun 26, 2024 | 9:15 PM

భారీ ఖర్చుతో నిర్మాణమైన కల్కి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదగయలో కల్కి సినిమా విజయం కోసం ప్రత్యేక పూజలు ,హోమాలు చేపట్టారు.. ప్రముఖ దత్త ఉపాసకుడు లక్ష్మీనారాయణ దత్త, పాదగయ పుణ్యక్షేత్రంలో దత్త హోమం నిర్వహించారు.. పిఠాపురంలో దత్త పూజలు నిర్వహించి విడుదల అయిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనాగఅశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్ వంటి ప్రముఖ హీరోలు నటించిన ఈ సినిమా కూడా విజయం కోసం దత్త హోమం నిర్వహించామన్నారు..ప్రముఖ చిత్ర నిర్మాత సంస్థ వైజయంతి మూవీ అధినేత సి.అశ్విని దత్ కోరిక మేరకు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్టు దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్త పేర్కొన్నారు.. రేపు విడుదల కానున్న ప్రభాస్ కల్కి సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

 

Follow Us