Adivi Sesh: అడివి శేష్ మేజర్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..

|

Jan 05, 2022 | 6:59 AM

టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మేజల్. ఈ సినిమా ముంబై ఉగ్రదాడి అమరుడు

Adivi Sesh: అడివి శేష్ మేజర్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..
Major
Follow us on

టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మేజల్. ఈ సినిమా ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంల అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, హిందీలో భాష‌ల‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మేజర్ సినిమా నుంచి మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

తాజాగా మేజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయమా..అనే పాటను ఈ నెల 7న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల ‘మేజర్’ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ‘మేజర్’ మ్యూజిక్ మ్యాజిక్ హృదయమా పాటతో మొదలు కానుంది. ఈ పాటకు వీఎన్ వీ రమేష్, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా..సిధ్ శ్రీరామ్ ఆలపించారు. హృదయమా అడివి శేష్, సాయీ మంజ్రేకర్ జంటపై చిత్రీకరించిన రొమాంటిక్ గా పాటగా పిక్చరైజ్ చేశారు.

ఇటీవలే ఈ సినిమా హిందీ వెర్షన్‌కి డబ్బింగ్ ప్రారంభించారు హీరో అడివి శేష్. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్ తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో ‘మేజర్’ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ‘మేజర్’ టీజ‌ర్‌కి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా ‘మేజర్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, ఈ చిత్రం హిందీ, తెలుగు, మలయాళంలో విడుదల కానుంది. మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ ఏప్లస్ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్.

Also Read: RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..

Shahrukh Khan: షారుఖ్‌ అంటే విదేశీయులకు కూడా ఇంత అభిమానమా.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి