Fire Accident: హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో సినిమా షూటింగ్ .. వాహనంలో డీజిల్ లీక్ అగ్ని ప్రమాదం

Fire Accident in Film Nagar: కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ సందడి మళ్ళీ మొదలైంది. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..

Fire Accident: హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో సినిమా షూటింగ్ .. వాహనంలో డీజిల్ లీక్ అగ్ని ప్రమాదం
Fire Accident

Updated on: Aug 12, 2021 | 7:49 AM

Fire Accident in Film Nagar: కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ సందడి మళ్ళీ మొదలైంది. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఫిల్మ్ నగర్ లో ఓ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. వాహనంలోని డిజిల్ లీక్‌ కావడంతో రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదంతో షూటింగ్‌ నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Also Read: Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం.. కురిల్ సరస్సులో కూలిన హెలికాఫ్టర్.. రక్షణ చర్యలు వేగవంతం

‘సలార్’ నుంచి వీడియో లీక్.. ఆకట్టుకుంటున్న ప్రభాస్ లుక్..

శ్రీవిష్ణు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘రాజ రాజ చోర’ వచ్చేది అప్పుడే..