
టాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్ని నెలలపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. చివరగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో కనిపించింది. అయితే అదే సమయంలో మయోసైటిస్ మరింత ఇబ్బందిపెట్టడంతో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో అప్పటివరకు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. అమెరికా, భూటాన్ దేశాల్లో ఇమ్యూనిటి ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అటు వ్యాపారరంగంలోనూ రాణించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. అలాగే పలు వాణిజ్య ప్రకటనలు.. మూవీ ఈవెంట్స్, రియాల్టీ షోలలో సందడి చేస్తుంది సామ్. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ సామ్ నటించిన సిటాడెల్ మాత్రం అడియన్స్ ముందుకు రావాల్సి ఉంది.
ఖుషి సినిమా చిత్రీకరణ సమయంలోనే సిటాడెల్ షూటింగ్ లోనూ పాల్గొంది సామ్. ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ లో ఇది తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. సమంత మయోసైటిస్ సమస్యతో ఇబ్బందిపడడంతో.. షూటింగ్ పూర్తైన పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీపై అప్డేట్ ఇచ్చింది సామ్.
సిటాడెల్ ప్రాజెక్ట్ టీంతో కలిసి ఈ చిత్రాన్ని చూస్తున్న ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. “ఫైనల్లీ.. మనం ఏదో ఒకటి చూడాలి. మనం ఇలాగే ఉన్నాం” అంటూ రాసుకొచ్చింది. సమంత షేర్ చేసిన ఫోటోలలో సమంత, వరుణ్ ధావన్, దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే, రచయిత సీతా ఆర్ మీనన్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.