Tirupati: తిరుపతిలో సినిమా షూటింగ్.. ట్రాఫిక్ ఇక్కట్లు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు

గోవిందరాజస్వామి టెంపుల్ గాలిగోపురం ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహించుకునేందుకు పోలీసు యంత్రాంగం అనుమతించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌కు 30, 31 తేదీల్లో రెండ్రోజులు షూటింగ్ పర్మిషన్ ఇచ్చిన తిరుపతి పోలీసు యంత్రాంగం పలు కండిషన్స్ అప్లై చేసింది.

Tirupati: తిరుపతిలో సినిమా షూటింగ్.. ట్రాఫిక్ ఇక్కట్లు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు
Tirupati

Edited By:

Updated on: Jan 30, 2024 | 1:44 PM

తిరుపతిలో సినిమా షూటింగ్ వివాదాస్పదంగా మారింది. అలిపిరి గరుడ సర్కిల్, కపిల తీర్థం లోని నంది సర్కిల్ తోపాటు గోవిందరాజస్వామి టెంపుల్ గాలిగోపురం ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహించుకునేందుకు పోలీసు యంత్రాంగం అనుమతించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌కు 30, 31 తేదీల్లో రెండ్రోజులు షూటింగ్ పర్మిషన్ ఇచ్చిన తిరుపతి పోలీసు యంత్రాంగం పలు కండిషన్స్ అప్లై చేసింది.

హీరో ధనుష్, నాగార్జున, భాగ్యరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న యూనిట్ అలిపిరి వద్ద అర్ధరాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు షూటింగ్ నిర్వహించింది. పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం అలిపిరి గరుడ సర్కిల్‌లో ఉదయం నుంచి 6 నుంచి 10 10 గంటల వరకు, నంది సర్కిల్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు షూటింగ్ జరగాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు గోవిందరాజ స్వామి ఆలయం ముందున్న గాలిగోపురం తిరుపతి రోడ్లలో సినిమా షూటింగ్ కు పర్మిషన్ ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి అలిపిరి గరుడ సర్కిల్ లో హీరో ధనుష్ పాల్గొన్న కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. యాక్సిడెంట్ సన్నివేశాలను నిర్వహించిన సినిమా షూటింగ్ తో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తిరుమలకు వెళ్ళే వాహనాలను దారి మళ్లించిన పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేసినా
స్కూళ్ళ కు వెళ్ళే విద్యార్థులు, డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులతో పాటు భక్తులకు ఇబ్బంది కలిగింది. అలిపిరి సర్కిల్ లో సినిమా షూటింగ్ వల్ల ఇబ్బంది పడ్డ భక్తులు వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో బౌన్సర్లు రంగంలోకి దిగడం ఉద్రిక్తతకు కారణం అయింది. అయితే అన్ని అనుమతులు తీసుకునే షూటింగ్ నిర్వహిస్తున్నామన్న సినిమా యూనిట్ యధావిధిగానే షూటింగు పూర్తిచేసింది. టీటీడీ కి చెందిన ప్రాంతాల్లో సినిమా షూటింగుపై టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పర్మిషన్ లేదని తెలుస్తోంది. అయితే ఈరోజు రేపు రెండు రోజుల సినిమా షూటింగ్ పర్మిషన్ ఇచ్చిన పోలీసు యంత్రాంగం అలిపిరి గరుడ సర్కిల్ లో జరిగిన ఇష్యూ ను దృష్టి లో ఉంచుకుని కపిల తీర్థం లోని నంది సర్కిల్, గోవిందరాజస్వామి ఆలయ గోపురం ప్రాంతాల్లో షూటింగ్ కు అనుమతిస్తుందా లేదా అన్న విషయం సస్పెన్స్ గా మారింది.
అయితే పలు ఆంక్షలతోపాటు పలు షరతులు విధించింది.

షూటింగ్ నిర్వహణ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని అసభ్యకర నృత్యాలు పాటలు, శబ్దాలు చేయకూడదని ఆర్డర్ కాపీలో పేర్కొంది. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా బాణాసంచా కాల్చకుండా డ్రోన్ కెమెరాలు వాడకుండదని షరతు విధించింది. అలాగే షూటింగ్ జరిగే ప్రాంతాల్లో తొక్కిసలాట లాంటివి జరగకుండా కంట్రోల్ చేసేందుకు వాలంటీర్లను నియమించుకోవాలన్న నిబంధనలు దాదాపు 19 షరతులను విధించి అనుమతించింది పోలీసు యంత్రాంగం. అయితే ఉదయం అలిపిరి వద్ద సినిమా షూటింగ్ నిర్వహించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది దాంతో భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే అనుమతి మేరకు షూటింగ్ తిరుపతిలో కొనసాగుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి