Puneeth Rajkumar: అప్పు మా హృదయాల్లో నీ స్థానం పదిలం.. పునీత్‌కు నివాళులర్పిస్తున్న ప్రముఖులు

గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. కన్నడ  సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్.

Puneeth Rajkumar: అప్పు మా హృదయాల్లో నీ స్థానం పదిలం.. పునీత్‌కు నివాళులర్పిస్తున్న ప్రముఖులు
Puneeth Rajkumar

Updated on: Oct 29, 2022 | 5:38 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఒక ఏడాది గడిచిపోయింది. పునీత్ రాజ్ కుమార్ మరణం ను ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. కన్నడ  సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడి గా అనేక సినిమాల్లో నటించిన పునీత్.. అప్పు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. సినిమాతో తన అభిమానులను అలరిస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పలు స్వచ్చంద సంస్థలకు భారీ విరాళాలు ఇచ్చి ప్రజలలో ప్రాచుర్యం పొందాడు. సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు పునీత్.

ఇక పునీత్ మరణించి ఏడాది కావడంతో ఈ రోజు పునీత్ ను తలుచుకొని పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ‘వుయ్ మిస్ యూ అప్పు ’ అంటూ పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పూ లీవిస్ ఆన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.. ఇక పునీత్ నటించిన చివరి చిత్రం ‘గంధడ గుడి’ నిన్న (అక్టోబర్ 28న) విడుదలైంది. ఈ సినిమాను కన్నడ ప్రభుత్వం భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.

ఇవి కూడా చదవండి

పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పునీత్ కు తెలుగునాట ఆయనకు అశేష అభిమానగణం ఉంది. ఈ నేపథ్యంలో పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..