MAA Election Results Reactions: ‘మా’ అసోషియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సభ్యులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను నిరసనలు తెలియజేస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో మా అసోసియేషన్‌లో జరిగిన ఆర్ధిక లావాదేవీలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరబోతున్నారు మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. కొత్త కమిటీ దీనిపై చర్యలు తీసుకోకుంటే తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని అంటున్నారాయన.
మంచు విష్ణు విజయం ప్రకటించిన కొన్ని నిముషాల్లోనే మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం ప్రకాష్ రాజ్ కూడా.. తాను అసోషియేషన్‌లో కొనసాగలేనంటూ తేల్చి చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోకి అతిధిగా వచ్చా.. అతిధిగానే వెళ్లిపోతున్నట్టు తెలిపారాయన.
ఇప్పుడు ఇదే బాటలో సీనియర్ నటుడు శివాజీ రాజా కూడా అదే బాటలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ దారిలో నెక్ట్స్ ఎవరు ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నికలు జరిగిన 24 గంటల్లోనే సభ్యులు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
ఇన్ని రోజులు అసోషియేషన్‌తో కలిసి నడిచిన సభ్యులు వరుసగా రాజీమానాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. విష్ణు గెలపును, ప్రకాశ్ రాజ్ ఓటమిని జీర్ణించుకోలేక రాజీనామా చేస్తున్నారా.. లేక అసోషియేషన్‌లో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయి.. సభ్యత్వాన్ని వదులుకుంటున్నారా.. అనేది అర్ధం కావడం లేదు.
మరోవైపు మా అసోషియేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. నిన్న కొంత మంది కీలక సభ్యుల గెలుపును మాత్రమే ఈసీ ప్రకటించింది. మిగిలిన ఫలితాలను మరి కొద్ది సేపటిలో విడుదల కాబోతున్నాయి.