Ram Lakshman: కొండ రాళ్ల మధ్య ఇరుక్కున్న శునకం.. జేసీబీ తెప్పించి మరీ కాపాడిన రామ్-లక్ష్మణ్.. వీడియో చూడండి

|

Oct 18, 2024 | 5:42 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ది రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు రామ్, లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోసం మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో రామ్ లక్ష్మణ్ బృందం స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తోంది.

Ram Lakshman: కొండ రాళ్ల మధ్య ఇరుక్కున్న శునకం.. జేసీబీ తెప్పించి మరీ కాపాడిన రామ్-లక్ష్మణ్.. వీడియో చూడండి
Ram Lakshman
Follow us on

టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారీ ట్విన్ బ్రదర్స్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలన్నింటికీ పని చేశారు రామ్, లక్ష్మణ్. తమ ప్రతిభకు ప్రతీకగా ఏకంగా ఆరు నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినీ ఫైట్ మాస్టర్స్ గొప్ప మనసును చాటుకున్నారు. భారీ కొండరాళ్ల మధ్య చిక్కుకున్న శునకాన్ని రక్షించి అందరి మనసులు గెల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రామ లక్ష్మణ్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు రామ్ లక్ష్మణ్. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలోని అజీజ్‌నగర్‌లో రామ్‌-లక్ష్మణ్‌ ఫైట్‌ మాస్టర్స్‌ టీమ్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే రామ్, లక్ష్మణ్ ల బృందానికి కుక్కల ఏడుపు శబ్దం వినిపించింది. ఏమయ్యిందోనని సంఘటన స్థలానికి వెళ్లి చూశారు. తీరా చూస్తే అక్కడ ఓ పెద్ద బండరాయి చీలిక మధ్యలో చిక్కుకుపోయిన తల్లి కుక్క ఒక వైపు, పక్కనే ఆకలితో అలమటిస్తోన్న 10 కుక్క పిల్లల రోధనల వారి కంట పడింది. ఈ దృశ్యాన్నిచూసి రామ్, లక్ష్మణ్ లు చలించిపోయారు.

సొంత ఖర్చులతో జేసీబీని తెప్పించి..

శునకాన్ని కాపాడేందుకు ఆ బండరాళ్లను కదిలించడం మనుషులతో సాధ్యం కాదని గుర్తించిన రామ్, లక్ష్మణ్ లు వెంటనే సొంత ఖర్చులతో జేసీబీని పిలిపించారు. దాని సహాయంతో తల్లి కుక్కను కాపాడి బయటకు తీసి దాని పిల్లల చెంతకు చేర్చారు. అంతే కాకుండా వాటికి ఆహారం, నీళ్లు అందించారు. పిల్లల దగ్గరకు చేరిన తల్లి కుక్క ఆనదం.. తల్లి రావడంతో పిల్లల ఆనందం.. ఆ వెంటనే పిల్లలు తల్లి పాలు తాగడం.. ఇలా అక్కడి దృశ్యాలను చూసి రామ్, లక్ష్మణ్ లు సహా అక్కడున్న వారంతా ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. శనకాన్ని కాపాడి పిల్లల దగ్గరకు చేర్చేందుకు రామ్, లక్ష్మణ్ ల పడిన కష్టాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి