ట్రిపులార్(RRR) మూవీ.. థియేటర్ రన్ దాదాపుగా కంప్లీటైనట్టే. టాలీవుడ్ నుంచి ఎమర్జ్ అయిన లేటెస్ట్ ప్రౌడ్ ప్రజెంటేషన్ ట్రిపులార్‌ని దాదాపు ప్రేక్షక లోకమంతా ఎంజాయ్ చేసింది. కానీ.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్‌ని చాకచక్యంగా షురూ చేస్తూ ఇప్పటికీ రిపీట్ ఆడియన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే రెండు సాలిడ్ వీడియో సాంగ్స్‌ని చివరివరకూ దాచిపెట్టేశారా.. అంటే అవును అనే టాక్ వినిపిస్తుంది. ట్రిపులార్ స్టోరీలోకి ఆడియన్స్‌ని డ్రైవ్ చేసిన ట్రిగ్గర్ పాయింట్ లాంటి పాట కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా. సినిమా రిలీజ్ కాగానే.. మొదటగా ఈ స్వీట్ మెలోడీ వీడియోనే బైటికొదిలారు. ఆ తర్వాత నాటునాటు పాట పూర్తి పాఠాన్ని చెబుతూ తారక్-చెర్రీ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్ నిచ్చారు. ఆ వెంటనే సైన్-ఆఫ్ సాంగ్ ఎత్తర జెండాలో తన ఆర్టిస్టులతో కలిసి జక్కన్న కూడా కాలూచెయ్యీ కదిపిన వైనాన్ని రివీల్ చేశారు. ఇద్దరు హీరోల దోస్తీ పాటను కూడా బైటపెట్టేశారు. ఇంతవరకూ ఓపిగ్గా ఉన్న ఫ్యాన్స్… సినిమాకు ఆయువుపట్టు లాంటి రామమ్ రాఘవమ్, కొమురం భీముడో పాటల సంగతేంటి అని నెట్లో నిలదీయ్యడం మొదలైంది. రామమ్ రాఘవమ్ పాట క్లయిమాక్స్‌ని రక్తి కట్టిస్తే.. కొమురం భీముడో ప్రీక్లయిమాక్స్‌కి ప్రాణం పోసింది.
జూనియర్ ఎన్టీయార్ అభిమానులైతే.. ట్రిపులార్ కమర్షియల్ ఎలిమెంట్స్‌లో మేజర్ థింగ్ తమ హీరో సోలో సాంగేనని గట్టిగా చెప్పుకుంటున్నారు. కొమురం భీముడో పాటలో శిక్ష వేసే చరణ్ కంటే, ఆ శిక్షను అనుభవించే తారక్కే ప్రాణం పెట్టి నటించారని సర్టిఫై చేసుకుంటున్నారు. అందుకే.. ఆ పాట వీడియో వెర్షన్ వచ్చేదాకా ఓపిక పట్టలేక ఇలా శాటిస్‌ఫై ఔతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అందరూ పూనుకుని డజన్ల కొద్దీ స్పూఫ్ వీడియోలతో కొమురం భీముడో పాటకు ముందస్తుగానే పట్టం కట్టేస్తున్నారు. ఆ రెండు ఒరిజినల్ వీడియో సాంగ్స్ కనుక రిలీజైతే… ట్రిపులార్ సినిమా టోటల్ కంటెంట్ రివీలైనట్టే కనుక.. మేకర్స్ కూడా హైడ్ అండ్ సీక్ ఆడుతూనే ఉన్నారు.