Prabhas: ప్రభాస్ భార్య, పిల్లలను చూశారా ?.. ఫ్యాన్స్ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..

|

Oct 06, 2023 | 3:49 PM

ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఫలానా అమ్మాయితో డార్లింగ్ ఏడడుగులు వేయబోతున్నారంటూ టాక్ నడిచింది. అప్పట్లో బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాట ఎత్తకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ మూవీ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

Prabhas: ప్రభాస్ భార్య, పిల్లలను చూశారా ?.. ఫ్యాన్స్ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
Prabhas
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆయన పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఫలానా అమ్మాయితో డార్లింగ్ ఏడడుగులు వేయబోతున్నారంటూ టాక్ నడిచింది. అప్పట్లో బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాట ఎత్తకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ మూవీ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ అదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రేమ అంటూ వార్తలు వినిపించాయి. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని బీటౌన్ బ్యూటీ కొట్టిపారేసింది. ప్రభాస్‏ మాత్రం రూమర్స్ పై స్పందించలేదు.

అయితే ముందు నుంచి ప్రభాస్ పెళ్లి అనుష్కతో జరిగితే బాగుంటుందని ఆశపడుతుంటారు ఫ్యాన్స్. గతంలో వచ్చిన బిల్లా, మిర్చి చిత్రాలలో వీరిద్దరి కెమిస్ట్రీ అడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ ఆన్ స్క్రీన్ జంటకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో వీరిద్దరూ రియల్ లైఫ్ లో జోడి అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడ టెక్నాలజీ సాయంతో అతడికి ఓ ఫ్యామిలీని క్రియేట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ప్రభాస్ భార్య, పిల్లల ఫోటోస్ వైరలవుతున్నాయి. కంగారు పడకండి.. ప్రభాస్ భార్య, పిల్లలు అంటే నిజమైనవారు కాదు.. ఏఐ క్రియేషన్స్.

ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్, అనుష్కకు పెళ్లి జరిగినట్లుగా వీరికి ఒక పాప, బాబు ఉన్నట్లుగా ఫోటోస్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ #Pranushka అంటూ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్.. ప్రభాస్ ఎలాగో పెళ్లి చేసుకోవడం లేదని.. మీరే పెళ్లి చేసేసారా ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.