Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్‌ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

ఇది నా ఒక్కడి సమస్య కాదు.. హీరోలందరికీ ఇజ్జత్‌ కా సవాల్.. అంటూ.. కొలీగ్స్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని వాదనకొచ్చేశారు వకీల్‌సాబ్‌. హీరోల పరువు ప్రతిష్టల్ని కాపాడ్డమే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుని ముందుకెళ్తున్నారట పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌.

Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్‌ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే
Pawan Kalyan

Updated on: Apr 10, 2022 | 7:28 PM

ఇది నా ఒక్కడి సమస్య కాదు.. హీరోలందరికీ ఇజ్జత్‌ కా సవాల్.. అంటూ.. కొలీగ్స్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని వాదనకొచ్చేశారు వకీల్‌సాబ్‌(Pawan Kalyan). హీరోల పరువు ప్రతిష్టల్ని కాపాడ్డమే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుని ముందుకెళ్తున్నారట పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌. మా సారు నిన్నటిదాకా మాటలతో సరిపెట్టారు.. ఇక యాక్షన్‌ పార్ట్ షురూ చేస్తున్నారు అంటోంది పీకే సేన. ఊరికే హీరోలమైపోలేదు.. కిందా మీదా పడి కసరత్తులు చేసి కష్టపడితేనే సినిమాల్లో మాకు పైసలిస్తారు..! తన కాల్‌షీట్ రేట్లపై అదేపనిగా కౌంటర్లేస్తున్న వాళ్లకు పవర్‌స్టార్ ఓపెన్‌గా ఇచ్చిన ఆన్సరిది. అది ఆవేశంలో చెప్పిన మాట కాదు.. అక్షరాలా నిజం అని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ కోసం పవన్ చేస్తున్న కసరత్తు ఇప్పుడు టాక్‌ఆఫ్‌ది ఇండస్ట్రీ అయింది.

క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామా కావడంతో.. విపరీతంగా చెమటోడుస్తున్నారు పవన్‌. టోడోర్ లాజారోవ్ అనే బల్గేరియన్ స్టంట్ మాస్టర్‌ని డిప్యూట్ చేసుకుని.. హై ఆక్టేన్ సీక్వెన్స్‌ కోసం స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు పవర్‌స్టార్. ఈ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్. గన్ను పట్టినా, కత్తిపట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగు లేదు దేవరా అంటూ పవన్‌ పట్ల తనకున్న వీరభక్తిని చాటుకున్నారు బండ్ల గణేష్. రీసెంట్‌గా హిట్టయిన భీమ్లానాయక్ ఫైట్ సీక్వెన్స్‌లో కూడా తాను పడ్డ కష్టాన్ని వర్కింగ్ స్టిల్స్‌ ద్వారా రివీల్ చేశారు పవర్‌స్టార్. ఇంత చెమటోడిస్తేనే తెర మీద సీన్లు పండేది.. తమకు ఎంతోకొంత రెమ్యునరేషన్లొచ్చేది అని చెప్పకనే చెబుతున్నారు. రీసెంట్‌గా తమ హీరో సినిమాల్లో సంపాదించిన పైసల్ని రైతులకు నష్టపరిహారంగా ఇచ్చిన విషయాన్ని కూడా ప్రామినెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా అప్పుడెప్పుడో స్టేజ్‌ మీద చెప్పిన మాటను.. ఇప్పుడు యాక్టివేషన్లో చూపిస్తోంది పవన్‌ కాంపౌండ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 
Ranveer Singh: రణ్ వీర్ సింగ్ రాయల్ ఎంట్రీ.. వైరల్ అవుతోన్న హ్యాండ్సమ్ హీరో ఫోటోలు..

srinidhi shetty: పూల ఋతువుల కోమలిలాగ ఫ్యాన్స్ మతి పోగొడుతున్న కేజీఎఫ్ ముద్దుగుమ్మ ‘శ్రీనిధి శెట్టి’..

Viral Photo: ఈ చిన్నారి గాత్రానికి దేశమే ఫిదా.. వేల పాటలతో మంత్రముగ్దులను చేస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..