Family Man: ఆలస్యం కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్‌’ ఎంట్రీ.. అమేజాన్‌ వెనక్కి తగ్గడానికి కారణం అదేనా..?

|

Feb 02, 2021 | 5:05 AM

Family Man Web Series Postponed: ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్‌ ఫ్యామిలీ మ్యాన్‌ అనే వెబ్‌ సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్..

Family Man: ఆలస్యం కానున్న ఫ్యామిలీ మ్యాన్‌ ఎంట్రీ.. అమేజాన్‌ వెనక్కి తగ్గడానికి కారణం అదేనా..?
Family-Man-Series
Follow us on

Family Man Web Series Postponed: ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్‌ ఫ్యామిలీ మ్యాన్‌ అనే వెబ్‌ సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ యావత్‌ దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండో సీజన్‌లో అక్కినేని కోడలు సమంత కూడా నటిస్తోంది. అందులోనూ సామ్‌ టెర్రరిస్ట్‌గా నటిస్తుండడంతో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 12న ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే తాజాగా వెబ్‌ సిరీస్‌ విడుదల తేదీని వాయిదా వేస్తూ చిత్ర యూనిట్‌ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే దీనికి కారణంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అమేజాన్‌ ప్రైమ్‌ విడుదల చేసిన ‘తాండవ్‌’, ‘మీర్జాపూర్’ సిరీస్‌లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదురుకావడంతో ఆ ప్రభావం ఫ్యామిలీ మ్యాన్‌పై పడుతుందని భావించిన అమేజాన్‌ వెబ్‌ సిరీస్‌ విడుదలను వాయిదా వేసిందని సమాచారం. మరి ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

Also Read: డిఫరెంట్ లుక్‏లో కనిపించనున్న నాని.. ఆ సినిమా కోసం మేకోవర్ అవుతున్న నేచురల్ స్టార్..