AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Box Office Collection: ఆదరిస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్.. ఎఫ్3 మూవీ 5వ రోజు ఎంత వసూల్ చేసిందంటే

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రీసెంట్ గా ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ ను తన ఖాతలో వేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

F3 Box Office Collection: ఆదరిస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్.. ఎఫ్3 మూవీ 5వ రోజు ఎంత వసూల్ చేసిందంటే
F3 Movie
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2022 | 11:55 AM

Share

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). రీసెంట్ గా ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ ను తన ఖాతలో వేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఎఫ్ 2 కు మించి ఈ సినిమాలో కామెడీ ఉండటంతో ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఎఫ్ 3 సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీగానే కురిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఎఫ్ 3 మొదటి రోజు రూ. 10.37 కోట్ల షేర్ ను రాబట్టింది. అలాగే రెండో రోజు AP/TS షేర్ 18.77 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.64 కోట్లను వసూలు చేసింది.  4 రోజుల మొత్తంగా చూసుకుంటే 32.11 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఓవర్సీస్ విషయానికి వస్తే 2.3 మిలియన్ వసూళ్లను సాధించింది.అలాగే ఐదో రోజు ఎఫ్ 3 మూవీ 5 కోట్లకు పైగా వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3 సినిమా 72 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి