Ram and Boyapati : పూజా కార్యక్రమాలతో మొదలైన బోయపాటి, రామ్ మూవీ..

టాలీవుడ్ మాస్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు బోయపాటి శ్రీను(Boyapati Sreenu). బోయపాటి సినిమా తీస్తే బ్లాక్ బస్టరే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 'భద్ర', 'తులసి', 'సింహ', 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు', 'జయ జానకి నాయక', 'అఖండ'

Ram and Boyapati : పూజా కార్యక్రమాలతో మొదలైన బోయపాటి, రామ్ మూవీ..
Boyapati
Follow us

|

Updated on: Jun 01, 2022 | 1:20 PM

టాలీవుడ్ మాస్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు బోయపాటి శ్రీను(Boyapati Sreenu). బోయపాటి సినిమా తీస్తే బ్లాక్ బస్టరే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘భద్ర’, ‘తులసి’, ‘సింహ’, ‘దమ్ము’, ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘జయ జానకి నాయక’, ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన, కంటెంట్ బేస్డ్ కమర్షియల్ సినిమాలు తీసి హిట్స్ అందుకున్నారు బోయపాటి. సౌత్ టు నార్త్… ఇక బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్, డబ్బింగ్ అయ్యాయి. ఇప్పుడు ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా బోయపాటి శ్రీను పాన్ ఇండియా సినిమా ప్రారంభించారు.   బోయపాటి,రామ్ పోతినేని కాంబోలో వస్తున్నఈ పాన్ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం.. థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం రావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఆ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రమిది.  ఈ సినిమా దర్శకుడిగా బోయపాటికి 10, హీరో రామ్ కు 20వ సినిమా కావడం విశేషం.  హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. ‘ది వారియర్’ తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.

ఇవి కూడా చదవండి
Rapo

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..