Dussehra 2023: దసరా సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల పోటీ..

ఇప్పుడు దసరా పండగ రాబోతుంది. ఈ ఏడాది దసరా బరిలో ఏకంగా ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అయ్యారు. అందులో నాలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండగా.. ఒక్క సినిమా మాత్రమే తెలుగులోనే రిలీజ్ కానుంది. అదే బాలయ్య నటించిన భగవంత్ కేసరి. ఈ మూవీ మాత్రమే కేవలం తెలుగులోనే రిలీజ్ కాబోతుంది. ఇక ఈసారి కోలీవుడ్ స్టార్స్ చిత్రాలు కూడా దసరా బరిలో నిలిచాయి. అవెంటో తెలుసుకుందామా.

Dussehra 2023: దసరా సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల పోటీ..
Dussehra 2023 Movies

Updated on: Oct 12, 2023 | 6:11 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. చిన్న సినిమాల నుంచి పెద్ద చిత్రాల వరకు ఈ సీజన్‏లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోలు మాత్రం ఫెస్టివల్ సీజన్ పైనే గురిపెడుతుంటారు. ఇక ఇప్పుడు దసరా పండగ రాబోతుంది. ఈ ఏడాది దసరా బరిలో ఏకంగా ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అయ్యారు. అందులో నాలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండగా.. ఒక్క సినిమా మాత్రమే తెలుగులోనే రిలీజ్ కానుంది. అదే బాలయ్య నటించిన భగవంత్ కేసరి. ఈ మూవీ మాత్రమే కేవలం తెలుగులోనే రిలీజ్ కాబోతుంది. ఇక ఈసారి కోలీవుడ్ స్టార్స్ చిత్రాలు కూడా దసరా బరిలో నిలిచాయి. అవెంటో తెలుసుకుందామా.

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఇదివరకు అడియన్స్ ఎప్పుడూ చూడని బాలయ్యను ఈ మూవీలో చూడనున్నారని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అందుకు తగినట్లుగానే ఇప్పటివరకు విడుదలైన బాలయ్య పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే సాంగ్స్, ట్రైలర్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తోన్న ఈసినిమా అక్టోబర్ 19న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

అలాగే కోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం లియో. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. అలాగే కన్నడలో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ సినిమా సైతం అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

అలాగే మాస్ మాహారాజా రావితేజ నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ నటించిన చిత్రం గణపత్. ఈ సినిమాతో మరో ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అయ్యాడు టైగర్ ష్రాఫ్. ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఇక ఈసారి దసరా బరిలో అందరూ స్టార్ హీరోస్ సినిమాలు పోటీ పడనుండడంతో ఎవరు గెలుస్తారు ?.. అనే ఆసక్తి అడియన్స్ లో నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.