Sita ramam Twitter Review: ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ ఓ అందమైన క్లాసిక్ లవ్ డ్రామా.. సీతారామం ట్విట్టర్ రివ్యూ..

|

Aug 05, 2022 | 11:21 AM

ప్రేమ కథలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి. అందమైన ప్రేమకథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Sita ramam Twitter Review: యుద్ధంతో రాసిన ప్రేమ కథ ఓ అందమైన క్లాసిక్ లవ్ డ్రామా.. సీతారామం ట్విట్టర్ రివ్యూ..
Sita Ramam
Follow us on

ప్రేమ కథలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి. అందమైన ప్రేమకథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సీతారామం(Sita ramam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే రష్మిక మందన్న ఈసినిమాలో కీలక పాత్ర పోషించింది. రష్మిక తోపాటు హీరో సుమంత్ , భూమిక, గౌతమీనన్, తారు భాస్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు శ్రోతలను విపరీతంగా అలరించాయి.

ఇకనేడు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రీమియర్స్ చూస్తున ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకు రివ్యూ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉంది అనే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సీతారామం సినిమా క్లాసిక్ లవ్ డ్రామా అంటూ పొగుడుతున్నారు ప్రేక్షకులు. చాలా రోజులతర్వాత అందమైన ప్రేమ కథ చూశాం అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి