
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం సీతారామం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ఖాతాలో దుల్కర్ సల్మాన్ కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. అందులో ప్రమోషన్లతో బిజీగా ఉన్న హీరో.. ఉలవచారు బిర్యానీని లాగించేస్తున్నారు. విజయవాడలోని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉలవచారు బిర్యానీని ట్రై చేస్తున్న అంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యుద్ధం నేపథ్యంలో ఒక ప్రేమకథగా రాబోతున్న సీతారామం సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో అక్కినేని సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్, భూమికా చావ్లా , వెన్నెల కిశోర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సీతారామం సినిమా కోసం ముందుగా దుల్కర్ సల్మాన్ ను మాత్రమే ఎంచుకున్నానని.. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు సీతారామం అనుభూతిని ఇష్టపడతారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు డైరెక్టర్.
ట్వీట్..
When @dulQuer also became a fan of Ulavachaaru Biryani ?
Team #SitaRamam @ Vijayawada! @mrunal0801 @iSumanth @TharunBhasckerD @iamRashmika @hanurpudi @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/k3GMJHDw5j
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 31, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.