AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Digital News Round Up: అతడు సినిమాను వేణు వదులుకున్నాడా? | క్యాసినో ఆటలో టాలీవుడ్‌ హీరోయిన్లు..?

TV9 Digital News Round Up: అతడు సినిమాను వేణు వదులుకున్నాడా? | క్యాసినో ఆటలో టాలీవుడ్‌ హీరోయిన్లు..?

Anil kumar poka
|

Updated on: Jul 31, 2022 | 6:51 PM

Share

తవ్వుతున్న కొద్దీ చికోటి ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. క్యాసినోతో పాటు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయేమోనన్న..



తవ్వుతున్న కొద్దీ చికోటి ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. క్యాసినోతో పాటు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈడీ ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది కానీ .. క్యాసినో ఆటలో టాలీవుడ్‌ హీరోయిన్లు కూడా ఉండటమే సంచలనంగా మారిందిప్పుడు!

కొందరు వచ్చిన సువర్ణావకాశాలను వదులుకుంటారు. అందుకు కారణాలు అనేకం ఉండవచ్చు .. ఆ అవకాశాలను ఒడిసిపట్టుకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమోనని ఇప్పుడనిపిస్తుంటుంది! తొట్టంపూడి వేణు కూడా ఇలాగే రిగ్రేట్‌ అవుతున్నాడు. అందుకు కారణం మహేశ్‌బాబు నటించిన అతడు సినిమాను వదులుకోవడమే!

మనం సైకిల్‌ను ఎత్తడానికే ఆపసోపాలు పడిపోతాం! ఒక మోటార్‌ సైకిల్‌ను ఏమెత్తుతాం? కానీ బాహుబలిలాంటి కొందరు మాత్రం బైకులను అవలలీలగా ఎత్తేస్తారు. ఎత్తడమే కాదు, దాన్ని నెత్తిన పెట్టుకుని బస్సుపైకి ఎక్కిస్తారు. కుటుంబభారాన్ని నెత్తినేసుకున్న వ్యక్తికి బైక్‌ భారం ఓ లెక్క కాదు!

భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉంటే యమభటులు కాదు కదా, యముడైనా ఏమీ చేయలేడు. ఇలాంటి అదృష్టవంతులు త్రుటిలో చావు నుంచి బయటపడగలరు. అలాంటి గట్టి పిండాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. స్టోరీ ఆసాంతం చూసేయండి!

ట్రైన్‌లో వెళుతున్నప్పుడు విండో సీట్‌ కోసం చాలా మంది పట్టుపట్టేది ఎందుకంటే .. ప్రకృతి అందాలను తిలకించడం కోసం! అదో చక్కటి అనుభూతి! బస్సులో వెళితే ఆ మజా రాదు! రాజస్థాన్‌లోని దారా ఘాట్‌ నుంచి ప్రయాణిస్తున్న రైలును చూస్తే వారెవ్వా అని అనుకోకుండా ఉండలేం! అంత గొప్పగా ఉంటుంది.. నిజమేనండి…కావాలంటే మీరూ చూడండి!

రోడ్డు మీద నిలిచిన వర్షపు నీటిపై నుంచి ఏ వాహనమో వెళ్లి.. ఆ నీళ్లు మన మీద పడ్డాయనుకోండి! చిరాకనిపిస్తుంది. ఆ వెహికిల్‌ డ్రైవర్‌ను గట్టిగా తిట్టాలనిపిస్తుంది..! చేతిలో ఏ రాయో రప్పో ఉంటే ఆ వెహికిల్‌ మీద విసిరికొట్టాలన్నంత కోపం వస్తుంది. అంతే కానీ అలా వాహనాలు చిమ్మే నీటిని ఎంజాయ్‌ చేయలేం కదా! కానీ అలాంటి వాళ్లు కూడా ఉంటారు.. ఏం అనుమానంగా ఉందా? అయితే ఈ వీడియో చూడండి.

పెళ్లంటనే ఓ వేడుక. ఓ సరదా.. ఓ సంబరం. అందుకే ఇప్పుడు జరుగుతున్న వివాహవేడుకలు మామూలుగా ఉండటం లేదు.. మెహందీలు, సంగీత్‌లు, ఆట పాటలు ఇలా బోల్డంత ఫన్‌ ఉంటోంది.. ఇక వధూవరుల డాన్స్‌లు అయితే పసందుగా ఉంటున్నాయి.. లేటెస్ట్‌గా వైరల్‌ అవుతోన్న ఓ వీడియోలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎంత బాగా డాన్స్‌ చేస్తున్నారో!

చెన్నై నగరంలో అంతర్జాతీయ చెస్‌ ఒలంపియాడ్‌ జరుగుతున్నది కదా! దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న టోర్నమెంట్‌ కదా! చదరంగం పుట్టింది కూడా మన దేశంలోనే కదా! అందుకే ఆ చదరంగ పోటీలను బ్రహ్మండంగా నిర్వహిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. ఇక పుదుక్కొట్టాయ్‌ కలెక్టర్‌ కవితా రాము రూపొందించిన వీడియో అయితే సీఎం స్టాలిన్‌ ప్రశంసలు కూడా అందుకుంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏమున్నదో!

ఈమధ్య చాలా మందికి ఉత్తినే బీపీలు పెరిగిపోతున్నాయి. ఓ ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టిందన్న కోపంతో ఓ మహిళ వీరంగమే చేశారు. బస్సు డ్రైవర్‌పై చేయి కూడా చేసుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.పెట్రోల్‌ బంకులలో బాటిళ్లలో, క్యాన్‌లలో పెట్రోల్‌ను అమ్మడం లేదు. పెట్రోల్‌ను చెడు పనులకు వాడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఓ చిన్నోడికి అర్జెంట్‌గా పెట్రోల్ అవసరమయ్యింది..బాటిళ్లలలో పోయరని తెలుసు! అందుకే తన బుర్రకు పదును పెట్టాడు. ఆ పిల్లోడి టెక్నిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలలో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Jul 31, 2022 06:51 PM