
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. 1994లో విడుదలైన కాదలన్ అనే తమిళ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. సూపర్ స్టా్ర్ రజినీకాంత్ జోడిగా బాషా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సినీరంగంలో నగ్మా చెల్లెల్లు సైతం హీరోయిన్లుగా రాణించారు. నగ్మా చెల్లెల్లు మరెవరో కాదు.. జ్యోతిక, రోషిణి. దశాబ్దాలపాటు సినీరంగంలో వరుస సినిమాలతో అలరించిన నగ్మా.. 2008 నుంచి సినిమాలకు దూరంగా ఉండిపోయారు.
చాలా కాలం తర్వాత నగ్మా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవలే సూర్య, జ్యోతిక దంపతుల కుమార్తే దియా ఇంటర్ పూర్తి చేసింది. తాజాగా ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకలకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ తల్లిదండ్రులుగా తాము గర్వపడుతున్నామంటూ రాసుకొచ్చింది జ్యోతిక. అయితే ఈ కార్యక్రమంలో నటి నగ్మా కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది నగ్మా. అందులో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..