Mahesh Babu: మహేష్ బాబు సైన్స్ ఫిక్ష‌న్ మూవీ నానిలో ఈ బుడ్డోడు గుర్తున్నాడా..? ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా..

|

May 29, 2023 | 12:11 PM

మహేష్ కమర్షియల్ సినిమాలే కాదు ప్రయోగాత్మక చిత్రాలతోనూ మెప్పించారు. సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా నిరాశ పరిచినా మహేష్ తన నటనతో ఆకట్టుకున్నారు.

Mahesh Babu: మహేష్ బాబు సైన్స్ ఫిక్ష‌న్ మూవీ నానిలో ఈ బుడ్డోడు గుర్తున్నాడా..? ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా..
Nani
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నారు. మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. మహేష్ నటించిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేష్ కమర్షియల్ సినిమాలే కాదు ప్రయోగాత్మక చిత్రాలతోనూ మెప్పించారు. సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా నిరాశ పరిచినా మహేష్ తన నటనతో ఆకట్టుకున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మహేష్‌కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ నటించింది. దేవయాని, ఐశ్వర్య, నాజర్, రఘువరన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, రవిబాబు, సంజయ్ స్వరూప్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రలో నటించిన బుడతడు ఎవరో తెలుసా..? అతను ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మాస్టర్ ప్రధ్‌. ఈ సినిమాలో మహేష్‌తో పాటు ఈ చిన్నాడు కూడా సమానంగా కనిపిస్తాడు. ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల ఘట్టమనేని నిర్మించారు. ఇక ఈ సినిమాలో నటించిన మాస్టర్ ప్రధ్‌ ఇప్పడు ఎలా ఉన్నాడో తెలుసా..

ఇప్పుడు ఆ చిన్నోడు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఈ చిన్నాడో చదువులతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బుడతడు ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధ్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని సినిమా 2004 మే 14న విడుదలై మహేష్ అభిమానులతో పాటు ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది.