ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ.. నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా

వివిధ కారణాలతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటారు కొందరు అందాల భామలు. అలా ఇప్పుడు కూడా ఓ తెలుగు హీరోయిన్ నెట్టింట గత్తర లేపుతోంది. అందం అభినయం ఉన్న కూడా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ.. నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా
Actress

Updated on: Apr 28, 2025 | 12:22 PM

సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం ఉండి అవకాశాలు రాక ఎదురుచూస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఛాన్స్ లు రాక ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసింది. అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. అలాగే కన్నడ, మలయాళంలోనూ ట్రై చేసింది. అయినా సక్సెస్ అవ్వలేదు. ఓ దర్శకుడిని రహస్యంగా పెళ్లి చేసుకొని వార్తల్లోనూ నిలిచింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు

చాలా మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో పూనమ్ బజ్వా ఒకరు. నవదీప్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత ప్రేమంటే ఇంతే అనే సినిమాలో నటించారు. ఆతర్వాత నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది.

ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అలాగే కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో చివరిగా బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ‘ఓం త్రీడి’ సినిమాను తెర‌కెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. దీని పై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట

ఇది కూడా చదవండి :ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.