Actress : శేఖర్ కమ్ముల హిట్ మూవీలో హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హిట్ మూవీల్లో నటించి మెప్పించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ అందులో తక్కువ మంది ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుని కొనసాగుతున్నారు. కానీ కొందరు ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా..?

Actress : శేఖర్ కమ్ముల హిట్ మూవీలో హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
Zara Shah

Updated on: Sep 15, 2025 | 4:40 PM

తెలుగు సినిమా ప్రపంచంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. యూత్ ను ఆకట్టుకునే అందమైన చిత్రాలను రూపొందించి తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు.. అందమైన ప్రేమకథలు.. యూత్ కు నచ్చే కథలతో అడియన్స్ ముందుకు వస్తుంటారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఎక్కువగా కొత్త నటీనటులను పరిచయం చేస్తుంటారు. ఇప్పటివరకు ఎంతమంది తారలను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. అయితే అందులో కొందరు మాత్రమే నిలబడి స్టార్స్ అయ్యారు. మరికొందరు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ సైతం ఈ రెండో జాబితాలోకి చెందిన వారే. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంటుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..

ఆ హీరోయిన్ పేరు జరా షా.. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరోయిన్ లక్ష్మీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మడు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. నాగరాజు పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ లక్ష్మి పాత్రలో నటించింది. ఆ తర్వాత నాగార్జున నటించిన భాయ్, అనుష్క రుద్రమదేవి చిత్రాల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

తెలుగులో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాకు 13 సంవత్సరాలు పూర్తయిందని ఈ బ్యూటీ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..