Tollywood: ఆర్య సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. కనిపెట్టారా..?

|

Sep 23, 2024 | 9:34 AM

బాల నటీనటులుగా రాణించిన ఎంతోమంది ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై హీరో హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు. ఈ అమ్మడు ఆ కోవకు చెందినదే. ఆర్య మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? ఇప్పుడు తను హీరోయిన్...

Tollywood: ఆర్య సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. కనిపెట్టారా..?
Sravya
Follow us on

బన్నీ.. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలు ఎన్నో చేయొచ్చు. అంతకుమించిన సినిమాల్లో కూడా నటించొచ్చు. కానీ ఆర్య మాత్రం అతని కెరీర్‌లో ఓ కల్ట్ క్లాసిక్. గంగోత్రి మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆర్య మూవీతోనే స్టార్‌గా మారాడు. అతని పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. లెక్కల మాస్టారు.. సుకుమార్ ప్రేమలోని కొత్త కోణాన్ని ఈ సినిమాతో ఆవిష్కరించారు. యూత్‌ను తెగ ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. బన్నీ స్టైల్‌, మేనరిజమ్స్‌కు కుర్రాళ్లు వెర్రెక్కిపోయారు. సినిమాకు పాటలు మరో ప్లస్. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ చుట్టూ కొంతమంది పిల్లలు కనిపిస్తూ ఉంటారు.

పైన ఇచ్చిన ఫోటోలో బన్నీ పక్కన ఉన్న పాపను గమనించారా..?. ఆర్య సినిమాలో బాలనటిగా కనిపించిన ఆ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తను మరెవరో కాదు శ్రావ్య. లవ్ యు బంగారం సినిమాతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది శ్రావ్య. కన్నడ సినిమా రోజ్‌తో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన నందిని నర్సింగ్ హోం మూవీలో కూడా కథానాయకిగా నటించింది. అలాగే తమిళంలో పగిరి, విలాయట్టు ఆరంభం మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది ఇండస్ట్రీకి ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తన అందమైన ఫోటోలతో అందర్నీ కట్టి పడేస్తుంది. తన లేటెస్ట్ లుక్ దిగువన ఉన్న ఫోటోల్లో చూసేయండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.