అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే

|

Feb 12, 2024 | 3:54 PM

మాస్ మహారాజా రవితేజ పూరిజగన్నాథ్ తో చాలా సినిమాలు చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్స్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి ఇలా వరుస సూపర్ హిట్స్ వచ్చాయి. వీటిలో అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి చాల డిఫరెంట్ మూవీ. ఈ సినిమా కథతో పాటు.. రవితేజ నటన, మూవీలో డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే
Actress
Follow us on

టాలీవుడ్ లో డైనమిక్ డైరెక్టర్ ఎవరు అంటూ టక్కున చెప్పే పేరు పూరిజగన్నాథ్. ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు పూరి. హీరోలను డిఫరెంట్ గా చూపించాలి అంటే పూరిజగన్నాథ్ అని అందరూ అంటుంటారు. పూరిజగన్నాథ్ తెరకెక్కించే సినిమాలే కాదు ఆయన సినిమాలో డైలాగ్స్  కూడా యువతకు చాలా దగ్గరగా ఉంటాయి. పూరిజగన్నాథ్ తో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. మాస్ మహారాజా రవితేజ పూరిజగన్నాథ్ తో చాలా సినిమాలు చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్స్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి ఇలా వరుస సూపర్ హిట్స్ వచ్చాయి. వీటిలో అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి చాల డిఫరెంట్ మూవీ. ఈ సినిమా కథతో పాటు.. రవితేజ నటన, మూవీలో డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Alphonsa

అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే కదలకుండా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఆసిన్ నటించింది. ఈ సినిమాలో కమెడియన్ అలికి సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది. అది ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఈ సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ చేతిలో మోసపోయి అనుకోని పరిస్థితిలో ఓ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుంటాడు అలీ.

ఈ సినిమాలో నటించిన ఆ అమ్మాయి గుర్తుందా.? ఆ బ్యూటీ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా నటిస్తుంది. ఆమె పేరు అల్ఫోన్సా. ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది ఈ చిన్నది. తెలుగులో వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలోనూ నటించింది.

Alphonsa

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ లో కనిపించింది ఈ చిన్నది. ఇక ఈ భామ ఇప్పుడు ఎలా ఉందో అని చాలా మంది నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2013 తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో కూడా పాతదే అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.