
పై ఫోటో చూశారా..! ఓ స్టార్ హీరోయిన్.. దాదాపు అగ్రహీరోలందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది. తెలుగు , తమిళ్ భాషల్లో తన సత్తా ఏంటో చూపించింది ఆ ముద్దుగుమ్మ. నటనలోనే కాదు అందంలోనూ ఆమె ఎవర్ గ్రీన్ హీరోయినే.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పటికీ అదే అందంతో కవ్విస్తుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టరా.? చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, లేటెస్ట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాకగ ఓ హీరోయిన్ కు సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో చక్కర్లు కొడుతుంది.
పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను కనిపెట్టరా..? ఒకప్పుడు ఆమె కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్. ఇప్పటికీ తరగని అందంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలియడం లేదా..? ఆమె మరెవరో కాదు.. అప్పటికీ ఇప్పటికీ కుర్రాళ్లను తన అందంతో కట్టేస్తున్న వయ్యారి భామ మీన. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది.
సినిమా ఇండస్ట్రీలో మీనా 40 ఏళ్లకు పైగా ఉన్నారు. తెలుగులో ఆమె ఎంతో మంది సూపర్ స్టార్స్ తో నటించింది. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది స్టార్స్ తో నటించింది. ఆ మధ్య అనారోగ్యంతో మీనా భర్త కన్నుమూశారు. ఇక మీనా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు మీనా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అందాల తార రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మీనా అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో.. అలానే ఉన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..