సినిమా సెట్‌లో చీపురు పట్టి ఊడ్చిన ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఇప్పటికీ..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. హీరోలకు సమానంగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే ఎంతో మంది హీరోయిన్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు.

సినిమా సెట్‌లో చీపురు పట్టి ఊడ్చిన ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఇప్పటికీ..
Actress

Updated on: Apr 21, 2025 | 1:09 PM

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. చాలా మంది అవకాశాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాగే కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ అవుతుంటారు. ఇక చాలా మంది స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. సమయం వచ్చినప్పుడల్లా తాము ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్తూ ఉంటారు. కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్స్ గా సక్సెస్ అయినా వారు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సెట్‌లో చీపురు పట్టి ఊడ్చిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్… దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఇంతకూ ఆమె ఎవరంటే..

హీరోయిన్స్ చాలా మంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని సక్సెస్ అయినా వారే.. ఒక పూట తినడానికి తిండి లేని రోజుల నుంచి ఇప్పుడు కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగారు చాలా మంది. ఇక సినిమా సెట్ లో చీపురు పట్టి ఊడ్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? బాలీవుడ్ స్టార్ బ్యూటీ రవీనా టాండన్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో ఎంతో మంది స్టార్స్ తో నటించి మెప్పించింది. రవీనా టాండన్ స్టార్ కిడ్ అయినప్పటికీ హీరోయిన్ అవ్వక ముందు ఆమె చాలా హార్డ్ వర్క్ చేశారు.

ఆమె తండ్రి రవి టాండన్ ఒక దర్శకుడు, మరియు తల్లి వీనా టాండన్. తండ్రి దర్శకుడు అయినా కూడా ఆమె ఎంతో కష్టపడ్డారు. సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా.. కూడా  ఆమె ప్రొడక్షన్‌ లో వర్కర్‌గా పనిచేసింది. సెట్‌లో చిన్న చిన్న ఆఫీస్‌ బాయ్‌ పనులు చేస్తూ మెప్పించింది. అంతే కాదు చీపురు పట్టి సెట్ లో ఊడ్చేదట.. తన తండ్రి సినిమాల సెట్లలో చిన్న చిన్న పనులు కూడా చేసేదాన్ని అని గతంలో ఓ ఇంటర్వ్యూలో రవీనా టాండన్ తెలిపారు. కేజీఎఫ్ 2 లో రమికా సేన్ గా ఆకట్టుకున్నారు రవీనా. ఇక ఇప్పుడు రవీనా టాండన్ కూతురు రాషా థడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.