
సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు కొంతమంది సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగాను చేసి మెప్పించారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె సినిమాల్లోనే కాదు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు. హీరోయిన్స్ బీట్ చేసే అందం, ఆకట్టుకునే నటన ఆమె సొంతం ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆమె యంగ్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇంతకూ ఆమె ఎవరో కాదు ప్రియా. ప్రియ తెలుగు సినిమా, సీరియల్ నటించి మెప్పించింది. ప్రియా అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. ఆమె 1997లో చిరంజీవి ‘మాస్టర్’ సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది. ప్రియ 2021లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. జెమినిలో ‘శక్తి’ సీరియల్ ద్వారా టీవీ ధారావాహికల్లో కూడా నటించి ప్రియసఖి సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది.
ఇక ఈ చిన్నది దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. అలాగే పదుల సంఖ్యలో సీరియల్స్ లో నటించింది. ఇక టీవీ షోల్లోనూ కనిపించింది ప్రియా. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ చిన్నదానికి లుక్ పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు స్లిమ్ గా మారి ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోయిన్స్ బీట్ చేసేలా మారిపోయింది ఈ భామ. ప్రియా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.