అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అయిపోతూ ఉంటారు. అరెరే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా ఆమె సినిమాల నుంచి మాయం అవుతుంది. మళ్ళీ కనిపించదు.. కొంతకాలానికి ప్రేక్షకులు కూడా ఆమెను మర్చిపోతారు. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ గుర్తుందా.?

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?
Actress

Updated on: Jan 27, 2026 | 8:52 AM

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ అందమైన ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంటారు. ఇక హీరోయిన్స్ గా ప్రేక్షకులను అలరించాలని, స్టార్ డమ్ సొంతం చేసుకోవాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు.. ఈ క్రమంలోనే కొంతమంది వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే మరికొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే మెప్పించి ఆ తర్వాత మాయం అవుతున్నారు. ఆ తర్వాత ఎప్పటికో ఓ సినిమా ఫంక్షన్ లోనో.. లేదా ఏదైనా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోనో కనిపించి షాక్ ఇస్తారు. ఇక కొంతమంది హీరోయిన్స్ కోసం నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు.

యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా గుర్తుందా.? తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. భరణి సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ గుర్తుందా..? బబ్లీ లుక్స్ తో, ఆకట్టుకునే స్మైల్ తో కవ్వించింది ఈ వయ్యారి భామ. ఆ బ్యూటీ పేరు ముక్త. అందాల భామ ముక్త మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుర్రాళ్ళ మనసులో బాణాలు గుచ్చింది. అందాల భామ ముక్త ఓట్ట ననయం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. ముక్త తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఫోటో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత కొన్ని తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ముక్త పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ముక్త ఎలా ఉంది.? అని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాను  తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలో ముక్త  ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముక్త కూతురు కూడా సినిమాల్లో నటించింది. కురువై పాప అనే సినిమాతో ముక్త రీఎంట్రీ ఇచ్చింది. ముక్త 2015లో సింగర్‌ రిమి టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లాడింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..