అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టారా.? ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

|

Jan 11, 2025 | 8:15 PM

ఒకప్పుడు.. ఇప్పుడు.. ఇన్ స్టాలో ఈ ట్రెండ్ మీరు చూసే ఉంటారు. చాలామంది నమ్మలేని విధంగా మారిపోయిన తమ, తమ లుక్స్‌ను ఇన్ స్టాలో పంచుకుంటున్నారు. ఆ ఫోటోలకు లైక్స్, కామెంట్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. అలానే సెలబ్రిటీల చిన్ననాటి, పాత ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బర్త్ డే లేదా ఏదైనా అకేషన్ వస్తే చాలు.. వారి ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.

అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టారా.? ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Actress
Follow us on

నెట్టింట హీరోయిన్స్ ఫోటోలకు కొదవే లేదు. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ . స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొంతమంది భామలు చిన్ననాటి ఫోటోలకు ఇప్పటి ఫోటోలకు అస్సలు పోలికే ఉండదు. చాలా మంది చాలా గ్లామరస్ గా మారిపోయి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బర్త్ డే లేదా ఏదైనా అకేషన్ వస్తే చాలు.. వారి ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైన ఫోటోలో సర్కిల్ పెట్టిన టీనేజ్ పాపను గుర్తుపట్టారా..?. తను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి, మంచి సినిమాలు చేస్తుంది.

ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు

ఎవరీ అమ్మాయి అనుకుంటున్నారా..?. నిజంగానే గుర్తుపట్టడం చాలా కష్టం. తను ఇండస్ట్రీకి రావడం కోసం అంతలా మారిపోయింది మరీ. సినిమాల్లో హీరోయిన్‌ అయ్యేందుకు జిమ్‌కి వెళ్లి ఫ్యాట్ అంత కరిగించి.. ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు కళ్యాణి ప్రియదర్శిన్.

సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్

అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాతో తన ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసింది కళ్యాణి. ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఉన్నా కానీ.. మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కానీ మలయాళ, తమిళ్ యాక్ట్ చేస్తూనే ఉంది. కళ్యాణి ఫాదర్ ప్రియదర్శన్ ప్రముఖ డైరెక్టర్. 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మూవీస్ డైరెక్ట్ చేశారు. ఇక కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో చేసింది తక్కవే అయినా.. ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.