Childhood Photo: ఈ చిన్నారి యువరాణి ఎవరో గుర్తుపట్టారా..? కుర్రకారు ఈ భామను అంత ఈజీగా మర్చిపోలేరు..
ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా తెలుగులో ఇలా మెరిసి అలా వెళ్లిపోయింది. ప్రస్తతం కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఇతర భాషల్లో బిజీ అయిపోతూ ఉంటారు. మన దగ్గర ఆఫర్స్ తగ్గితే చాలు లగేజ్ సర్దుకొని పక్క ఇండస్ట్రీలోకి జంప్ అవుతూ ఉంటారు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా తెలుగులో ఇలా మెరిసి అలా వెళ్లిపోయింది. ప్రస్తతం కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఎవరో గుర్తుపట్టారా..? పై ఫొటోలో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు కూడా అలానే ముద్దుగా ఉంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కుర్రకారు గుండెల్లో ముద్ర వేసింది ఈ భామ. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు..
భావన మీనన్ అంటే సడన్ గా గుర్తుపట్టకపోవచ్చు కానీ నీలిపురి గాజుల ఓ నీలవేణి పాటతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. భావన మీనన్ తెలుగులో మూడు సినిమాల్లోనే నటించింది. 2008లో వచ్చిన ఒంటరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన హీరో అనే సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా బోల్తా కొట్టింది.




ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమాలో నటించింది భావన. ఈ సినిమాలో నీలిపురి గాజుల ఓ నీలవేణి పాట బాగపాపులార్ అయ్యింది. సినిమా కంటే ఈ పాటతోనే కుర్రకారులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది భావన.

Bhavana
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..