సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో ఈ చిన్నది ఒకరు. చూడచక్కిని రూపం తో పాటు ఆకట్టుకునే నటన ఈ చిన్నదాని సొంతం. ఇటీవల స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయో. పై ఫొటోలో కనిపిస్తోన్న పాపాయి తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఈ మధ్య సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇంతకు పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?చెప్పుకోవడం పెద్ద కష్టమేమి కాదు సుమీ.. చిన్నపుడు ఎంత క్యూట్ గా ఉందో ఇప్పుడు కూడా ఆ భామ అంతే అందంగా ఉంది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో కాదు..
పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కనిపెట్టేశారా.. ఆమె మరెవరో కాదు అందాల చందమామ కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది.
మగధీర సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలు చేసింది. దాదాపు అందరు హీరోలతో జతకట్టింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని బిడ్డకు జన్మనించింది. ఈ క్రమంలో చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్ ఇప్పుడు రీఎంట్రీ రెడీ అయ్యింది. కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 లో చేస్తోంది కాజల్. అలాగే బాలకృష్ణ సినిమాలోనూ నటిస్తోందని టాక్.