Guess the Actress: ఈ బుంగమూతి ముద్దబంతి ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడికి ఇప్పుడు యూత్ యమా క్రేజ్ ఉంది

ఈ క్రమంలోనే ఓ అమ్మడి చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఆ అమ్మడికి ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Guess the Actress: ఈ బుంగమూతి ముద్దబంతి ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడికి ఇప్పుడు యూత్ యమా క్రేజ్ ఉంది
Actress
Follow us

|

Updated on: Mar 18, 2023 | 11:58 AM

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది తమ అభిమాన హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక తమ ఫెవరెట్ హీరోయిన్ చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉండేవారో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ అమ్మడి చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఆ అమ్మడికి ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కుర్రాళ్ళ కలల రాణి ఆ చిన్నది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరిస్తోంది. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టరా..?

పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నది ఎవరో కాదు. చాలా మంది ఫెవరెట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ చిన్నది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

కెరీర్ బిగినింగ్ లో స్కిన్ షో కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ.. నిత్యం రకరకాల ఫొటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలకు పెట్టింది పేరుగా మారింది ఈ చిన్నది. చీరకట్టినా.. మోడ్రన్ డ్రస్ లో మెరిసినా.. అందాలతో మతి పోగొడుతోంది అనుపమ. తాజాగా ఈ చిన్నది తన చిన్నతి ఫోటోలను షేర్ చేసింది.