ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లతో నటించి క్రేజ్ తెచ్చుకుంది.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు..

|

Oct 04, 2024 | 12:58 PM

తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడి క్రేజ్ మాములుగా ఉండదు. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో ఉంటారు. అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు, తమిళ్ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న భామ ఆమె. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది ఆ ముద్దుగుమ్మ. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ బ్యూటీ. 

ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లతో నటించి క్రేజ్ తెచ్చుకుంది.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు..
Actress
Follow us on

సినిమా వాళ్లకు ఉండే క్రేజే వేరు.. హీరో,  హీరోయిన్స్‌కు ఫ్యాన్స్ బేస్ మాములుగా ఉండదు. ఇక సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు ఫాన్స్. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడి క్రేజ్ మాములుగా ఉండదు. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో ఉంటారు. అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు, తమిళ్ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న భామ ఆమె. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది ఆ ముద్దుగుమ్మ. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ బ్యూటీ.

ఇది కూడా చదవండి : Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?

పై ఫొటోలో ఉన్న బ్యూటీ తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది ఆమె.. ఆమె ఎవరో కాదు క్రేజీ బ్యూటీ ఆసిన్. ఇండస్ట్రీలో ఆసిన్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండేది. ఇప్పుడు ఈ అమ్మడు సినిమాకు బ్రేక్ ఇచ్చింది కానీ అప్పుడు వరుస సినిమాలతో హోరెత్తించింది. అప్పటి కుర్రకారంతా ఆసిన్ ఫోటోలను పదిలంగా దాచుకునేవారు.. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే కనిపించేవి. అంతలా కుర్రాళ్ల మనసులు దోచేసింది ఈ వయ్యారి భామ.

ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి

ఇక సూర్య నటించిన గజినీ, రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసిన ఆసిన్ తెలుగులో శివమణి,ఘర్షణ,లక్ష్మి నరసింహ,చక్రం,గజినీ,మజా,దశావతారం వంటి పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది. అలాగే పవన్ కళ్యాణ్ తో అన్నవరం సినిమా చేసింది. ఆతర్వాత తెలుగులో నటించలేదు ఆసిన్. ఇక గజినీ సినిమా హిందీ రీమేక్ తో బాలీవుడ్ లోనూ సక్సెస్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.

ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.