Singham Movie: సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా గుర్తు పట్టలేకుండా మారిపోయాడు.. ఫొటోస్ వైరల్

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సింగం (తెలుగులో యముడు) సిరీస్ సినిమాలు ఎలాంటి సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంఛైజీ లో ఇప్పటివరకు మొత్తం మూడు సినిమాలు రాగా అన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తెలుగులోనూ ఈ పోలీస్ స్టోరీ సినిమాలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

Singham Movie: సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా గుర్తు పట్టలేకుండా మారిపోయాడు.. ఫొటోస్ వైరల్
Singham Movie

Updated on: Feb 27, 2026 | 7:41 PM

పోలీస్ సినిమాలాంటే చాలా మందికి గుర్తొచ్చేది సింగం (తెలుగులో యముడు) సిరీసే. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన ఈ సిరీస్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు ఆడియెన్స్ సైతం ఈ సినిమాలను తెగ చూసేశారు. ఇక ఈ పోలీస్ కాప్ స్టోరీలను మెచ్చిన బాలీవుడ్ దర్శకులు ఏకంగా తమ భాషల్లోకి రీమేక్ చేసుకుని మరీ ఆనందించారు. ఈ సింగం సిరీస్ సినిమాల్లో సూర్య యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవచ్చు. పోలీస్ అంటే ఇలాగే ఉండాలి అనే రేంజ్ లో నటించాడు సూర్య. ఈ ఫ్రాంచైజీ సినిమాకలు హరి దర్శకత్వం వహించాడు. ఇందులో ఫస్డ్ పార్ట్ యముడు సూపర్ డూపర్ హిట్టు కావడంతో ఆ తర్వాత సింగం-1, సింగం-2 సినిమాలొచ్చాయి. ఈ మూడు పార్టులు భారీ వసూళ్లు సాధించాయి. మరీ ముఖ్యంగా సింగం 2 అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింగం సిరీస్ అన్నీ సినిమాల్లోనూ అనుష్క హీరోయిన్ గా నటించింది. అలాగే రెండో పార్టులో హన్సిక, మూడో భాగంలో శ్రుతి హాసన్.. ఇలా చాలా మంది హీరయిన్సే ఈ మూవీస్ లో నటించారు. ఇక విలన్లుగా ముఖేష్ రుషీ, రెహమాన్ లు కనిపించారు.

కాగా ఈ సింగం సిరీస్ సినిమాల్లో సింగం 2 బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో రోల్ తో పాటు విలన్ డానీ రోల్ కూడా హైలెట్ గా నిలిచింది. డ్రగ్ డీలర్ మాఫీయాలో కింగ్‌గా ఎదిగిన అతని యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా సూర్య- డానీ కాంబినేషన్ లో వచ్చే సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. కాగా డానీ అసలు పేరు డానీ సపని. లండన్‌లో పుట్టి పెరిగిన ఆయన ‘ది బిల్’ అనే టెలివిజన్ సిరీస్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత బిట్వీన్‌ ది లైన్స్, క్యాజువాల్టి, ఫిష్, హాల్బి సిటీ.. వంటి పలు సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హోటల్ అనే హాలీవుడ్ థ్రిల్లర్ మూవీతో మొదటి సారి సిల్వర్ స్క్రీన్‌ కనిపించాడు. ఆ తర్వాత సాంగ్ ఫర్‌ ఏ రాబరీ బాయ్, ది ఆక్స్‌ఫర్డ్ మర్డర్స్, తేజ్, ట్రాన్స్.. ఇలా పలు పలు హాలీవుడ్ సినిమాల్లో డానీ నటించాడు.

ఇవి కూడా చదవండి

డానీ లేటెస్ట్ ఫొటోస్..

ఇక సింగం సినిమాతో ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు డానీ. ఆ తర్వాత ‘తరకాసుర’ అనే ఓ కన్నడ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అయితే డానీ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదని తెలుస్తోంది. ఇక అప్పటికీ ఇప్పటికీ డానీ మామ చాలా మారిపోయాడు. అప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపించిన డానీ మామ ఇప్పుడు పూర్తిగా గడ్డంతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి ఫొటోలు కొన్ని నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us