అమ్మబాబోయ్..! ఈ హీరోని గుర్తుపట్టరా..? అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు ఈయన

పై ఫొటోలో కనిపిస్తున్న హీరో కూడా.. ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఒకానొక సమయంలో అమ్మాయిల కలల రాకుమారుడు ఆయన. ఎంతో క్యూట్ లుక్స్ తో కనిపించి మెప్పించారు ఆ హీరో. దాదాపు 280 సినిమాలలో నటించాడు ఆ హీరో కానీ ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకు ఆయన ఎవరో కనిపెట్టరా.?

అమ్మబాబోయ్..! ఈ హీరోని గుర్తుపట్టరా..? అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు ఈయన
Actor
Follow us

|

Updated on: May 16, 2024 | 11:23 AM

సినిమాలో నటించిన ఇప్పుడు నటనకు దూరంగా ఉంటున్న వారిలో హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా ఉన్నారు. ఒకప్పుడు లవర్ బాయ్స్ గా ప్రేక్షకులను మెప్పించిన హీరోలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు హీరో తరుణ్ కూడా ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఎన్నో లవ్ స్టోరీస్ చేసిన తరుణ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న హీరో కూడా.. ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఒకానొక సమయంలో అమ్మాయిల కలల రాకుమారుడు ఆయన. ఎంతో క్యూట్ లుక్స్ తో కనిపించి మెప్పించారు ఆ హీరో. దాదాపు 280 సినిమాలలో నటించాడు ఆ హీరో కానీ ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకు ఆయన ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు పేరు హరీష్.. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో దాదాపు 280 సినిమాలలో నటించాడు హరీష్. కెరీర్ స్టార్టింగ్ లో బాల నటుడిగా పలు సినిమాల్లో మెప్పించారు హరీష్. 1990 లో ఇ.వి.వి. దర్శకత్వంలో ప్రేమ ఖైదీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఇదే సినిమా హిందీలోనూ ఇదే పేరుతో రిలీజ్ అయ్యింది

హరీష్ చివరిగా అల్లరి నరేష్ హీరోగా నటించిన పెళ్లయింది కానీ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా 2007లో వచ్చింది. ఈ సినిమా తర్వాత హరీష్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి నటించాడు హరీష్. ఎస్ పీ పరశురామ్ సినిమాలో మెగాస్టార్ తమ్ముడిగా కనిపించాడు. అంతే కాదు అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు లాంటి లెజండ్రీ హీరోల సినిమాల్లోనూ నటించాడు హరీష్.  ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన హరీష్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ హీరో ఏంటి ఇలా మారిపోయాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

హరీష్ వీడియో.,.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles