
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా కూలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ సైతం కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. రజినీ నటించిన హిట్ చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా.. జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా.. ? ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. చంద్రముఖి సినిమాలో బాలనటిగా కనిపించింది కాసేపే. కానీ జనాలను ఆకట్టుకుంది.
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..
చంద్రముఖి సినిమాలో వచ్చే అత్తింధోం సాంగ్ ఎంతో సూపర్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో కనిపించిన చిన్నారి గుర్తుందా.. ? ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమైంది. 2021లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆమెకు ఒక పాప సైతం ఉంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత.. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా సినీప్రియులను అలరిస్తుంది. సీరియల్స్ లో వరుసగా మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తూ టీవీ ప్రపంచంలో కథానాయికగా దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ప్రహర్షిత.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..