Tollywood: అరె ఏంట్రా ఇది.. ఆ అందాల హీరోయిన్ ఇట్టా మారిపోయిందేంటీ.. పరదేసి సాంగ్ బ్యూటీ గుర్తుందా.. ?

"పరదేశి పరదేశి జానా నహిన్" ఈ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. 90's సినీప్రియులకు ఈ సాంగ్ అప్పట్లో ఫేవరేట్. హిందీలో సంచలనం సృష్టించిన రాజా హిందుస్తానీ సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు.. ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఆ అందాల హీరోయిన్ ఇట్టా మారిపోయిందేంటీ.. పరదేసి సాంగ్ బ్యూటీ గుర్తుందా.. ?
Pratibha Sinha

Updated on: May 31, 2025 | 8:40 AM

మీరు 90’s మూవీ లవర్సా…? అయితే మీకు ఈ సాంగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పరదేశి పరదేశి జానా నహిన్’ అనే సాంగ్ అప్పట్లో ఓ రేంజ్ హిట్టయ్యంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రాజా హిందుస్తానీ సినిమాలోని ఈ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినబడేది. బీటౌన్ హీరో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పరదేశి సాంగ్ సైతం అదే స్థాయిలో ఆకట్టుకుంది. ఇక ఇందులో మెయిన్ హీరోయిన్ కరిష్మా కపూర్ అయినప్పటికీ అందం, అభినయంతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యిన హీరోయిన్ గుర్తుందా.. ? ఈ స్పెషల్ పాటలో కజ్రారీ కళ్లు, దేశీ స్టైల్లో అప్పట్లో యూత్ హృదయాలను దొచేసింది. ఆమె మరెవరో కాదండి.. ప్రముఖ నటి మాలా సిన్హా కుమార్తె ప్రతిభా సిన్హా.

ప్రతిభా సిన్హా 1992లో సుజోయ్ ముఖర్జీతో కలిసి సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. 1996లో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన రాజా హిందుస్తానీ సినిమాలోని పరదేశి పాటతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ పాటతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమె దిల్ హై బేతాబ్, పోకిరి రాజా, దీవానా మస్తానా, కోయి కిసి సే కమ్ నహిన్, మిలిటరీ రాజా వంటి చిత్రాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2000 ఏడాది నాటికి ఆకస్మాత్తుగా సినీ గ్లామర్ ప్రపంచానికి దూరమయ్యింది. ఇంటర్వ్యూలు, మూవీ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలలో ఎక్కడ కనిపించలేదు. అయితే ఇటీవల ముంబైలో జరిగిన చీరల ప్రదర్శనలో పాల్గొంది. దాదాపు 29 సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చింది ప్రతిభ సింగ్.

ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆమె చీరల ప్రదర్శనలో దాదాపు 10 చీరలు కొని.. అక్కడున్న ప్రజలతో సరదాగా మాట్లాడింది. అప్పట్లో అందంతో కుర్రకారు కలల రాణిగా ఉన్న ప్రతిభ సింగ్.. ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయింది. తాజాగా ఈ హీరోయిన్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

Pratibha Sinha New

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..