పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జల్సా ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఇందులో పవన్ సరసన గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించగా.. సెకండ్ హీరోయిన్ గా పార్వతి మెల్టన్ నటించింది. పేరుకు సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ తన స్ర్రీన్ ప్రెజన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. గ్లామర్ లుక్ లో కనిపించి కుర్రాళ్ల మతిపోగొట్టేసింది. ఈ సినిమాలో జో పాత్రలో కనిపించి మెప్పించింది. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ పవన్ నటించిన జల్సా మూవీతో చాలా ఫేమస్ అయిపోయింది. కానీ ఆ పాపులారిటీకి అదృష్టం జతకట్టలేదు. తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశం రాలేదు.
కెరీర్ తొలినాళ్లలో వెన్నెల వంటి ఫీల్ గుడ్ మూవీ ద్వారా కథానాయికగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గేమ్స, అల్లరే అల్లరి, మధుమాసం వంటి చిత్రాల్లో నటించింది. ఇక మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా మరోసారి బిగ్ స్క్రీన్ పై మెరిసింది. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ అదిరిపోయే స్టెప్పులతో యూట్యూబ్ షేక్ చేసింది పార్వతి.
తెలుగులో శ్రీమన్నారాయణ, యమయో యమా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి సడెన్ గా మాయమైంది. తెలుగులో అవకాశాలు అంతగా రాకపోవడంతో సినిమాలకు దూరమైన పార్వతి.. 2013లో శంసులాలానిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. విభిన్నమైన ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న ఈ బ్యూటీని ఇప్పుడు చూసి షాకవుతున్నారు నెటిజన్స్. అప్పట్లో బొద్దుగా ఉండే ఈ అందాల భామ సన్నజాజీ తీగలా మారిపోయింది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..