
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ ఆపద్బాంధవుడు ఒకటి. డైరెక్టర్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 1992లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో చిరు సరసన మీనాక్షి శేషాద్రి కథానాయికగా నటించింది. ఈ మూవీతో సినీరంగంలో మీనాక్షికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరు, మీనాక్షి జోడి, యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆపద్బాంధవుడు తర్వాత మీనాక్షికి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. దీంతో అప్పట్లో హిందీ చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. హిందీలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేదు. కానీ చేసిన ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.
అప్పట్లో 1980-90లలో భారీగా పారితోషికం తీసుకునే కథానాయికగా నిలిచింది మీనాక్షి. హిందీలో అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నా, అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. హిందీలో అనేక సినిమాల్లో నటించిన మీనాక్షి శేషాద్రి.. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 1995లో వీరి వివాహం జరగ్గా.. ఈ దంపతులకు పాప, బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది మీనాక్షి. ప్రస్తుతం ఆమె కుటుంబంలో అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం.
మీనాక్షి శేషాద్రి భరతనాట్య కళాకారిణి. అమెరికాలో ప్రస్తుతం ఆమె భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. వెండితెరకు దూరంగా ఉన్న ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా మీనాక్షికి సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అప్పట్లో చూడచక్కని రూపం.. కుందనపు బొమ్మలా కనిపించిన మీనాక్షి.. ఇప్పటికీ 60 ఏళ్ల వయసులోనే అదే అందంతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం మీనాక్షి లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..